మంచి పుస్తకం
మంచి పుస్తకం పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది. పుస్తకం నోరు తెరవని మహా వక్త అంటాడు సిసిరో అనే రోమన్ దేశపు మహా పండితుడు. మనిషికి పుస్తకానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పాఠశాలలో చేరిన దగ్గర్నుంచి చివరి దశ వరకు అన్ని దశల్లోనూ పుస్తకం మన మనసుకి తోడుగా ఉంటుంది . పుస్తక పఠనం అంటే కేవలం కాలక్షేపం కోసమేనా నిజానికి కాదు అని చెప్పాలి. కొన్ని పుస్తకాలు విజ్ఞానం పెంచుకోవడం కోసం, కొన్ని గ్రంథాలు జ్ఞానం సంపాదించడం కోసం చదువుతాము. కాలక్షేపానికి చదివే పుస్తకాలు మనకు ఏమి ఉపయోగం మన సమయాన్ని పాడు చేయడం తప్పితే. రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు చదివినప్పుడు జీవితంలో ఏది తప్పు ఏది ఒప్పు మన నడవడిక ఏ విధంగా ఉండాలి జీవితంలో ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి అనే విషయాలు తెలుస్తాయి. కొంతమంది ఆత్మ కథలు చదివినప్పుడు వారి జీవితంలో వారు సాధించిన విజయాలు వెనక ఉన్న కష్టం తెలుసుకుంటే విజయం సాధించాలంటే దానికి ఒక ప్రణాళిక ఉంది అందులో కష్టం ఉంది అనే విషయం తెలుస్తుంది. విజయం ఈ పదం మన జీవితాన్ని ఆవరించేంత శక్తివంతమైనది. ఇది అందరికీ కావాలి, కానీ అందరూ దాన్ని పొందలేరు. ఎందుకంటే దానికి దారిచూపే మార్గం మనకు తెలియదు. ...