రామ చిలుక
రామ చిలుక పేరులో రామ శబ్దం రంగు చూస్తే హరిత వర్ణం ముక్కు చూస్తే మిరప పండు కుత్తుక చుట్టూ రాముడి రంగు. నువ్వంటే మాకు ప్రాణం. మా ప్రాణం నీలాగే ఎగిరిపోతుందని తెలియని అమాయకులం. రామదాసు చరిత్ర తెలిసిన నిన్ను బోనులోనే బంధిస్తున్నాం. పక్షివని తెలిసినా మా భవిష్యత్తు చెప్పమని పైసలిస్తున్నాం. అందరికీ జాతకం చెప్పే నువ్వు బోను లో ఎందుకు బందీ అవుతావు తుర్రుమని ఎగిరిపోయి ఉండే దానివి కదా నీ తలరాత అలా ఉంది మా రాతని నువ్వు ఎలా చెప్పగలవు. ఎప్పుడూ నువ్వు చెట్ల మీద ఉంటేనే అందం. చిలకకొట్టిన జామపండు మాకు ఎప్పుడు అది అమృతతుల్యమే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279