పోస్ట్‌లు

ఇంకేమిటి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇంకేమిటి కబుర్లు

ఇంకేంటి కబుర్లు  ఏ ఇద్దరు కలుసుకున్న వారి మధ్యలో ఉన్న మౌనాన్ని  పోగొట్టడానికి, దగ్గర చేయడానికి కబుర్లు ఒక ఆధారం. కబురు అంటే సమాచారం, సందేశం, వర్తమానం ,ఇలా చాలా రకాల అర్ధాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు అంతా కులాసా యేనా అంటూ ప్రారంభమైన పలకరింపు అలా కబుర్లుకు దారితీస్తుంది. పక్కింటివాళ్ళతో గోడకి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ,రోడ్డుమీద ఎదురుపడితే, బజార్లో కనబడితే ,పార్కులు ,రచ్చబండలు,పల్లెటూర్లోబావులు,చెరువులు, మున్సిపాలిటీ కుళాయిలు ఇప్పుడైతే ఫేస్బుక్లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికి స్థావరాలు. కొంతమంది చెవిలో చెప్తారు . కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెబ్బలు ఆడుకున్నట్టు ఉంటుంది. మైక్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఇద్దరు మనుషులు కలుసుకుంటే తెలుసున్న సమాచారం చేర వేయకుండా ఉండలేరు. బాధలు చెప్పుకోకుండా ఉండలేరు కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా ఉండలేరు. ఎదుటివారి పరిస్థితి గురించి అర్థం చేసుకోరు. అలా చెప్పుకుంటూ పోతుంటారు. ఒకే రకమైన అభిరుచి ఉన్న వాళ్ళని ఆ రంగానికి సంబంధించిన వార్త దగ్గర చేస్తుంది. స్నేహం పెంచుతుంది. సాధారణంగా యువత అంతా క్రికెట్ గురించి సినిమాలు గు...