అంతిమ యాత్ర
అంతిమ యాత్ర హలో ప్రసాద్ గారు నేను ప్లాట్ నెంబర్ 425నుంచి మాట్లాడుతున్నాను . ఉదయం నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. కాస్త ఎలక్ట్రీషియన్ ని పంపించండి.సరే అండి రామారావు గారు ఎలక్ట్రీషియన్ 9 గంటలకు వస్తాడు .థాంక్స్ అండి అంటూ ఫోన్ పెట్టేసాడు రామారావు గారు. వివరాలన్నీ నోట్ చేసుకుని ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేసే అంతలో మళ్లీ మొబైల్ రింగ్ అయ్యింది. నేనండి ప్రశాంత్ ని ప్లాట్ నెంబర్ 530 నుంచి మాట్లాడుతున్నాను. మా బాత్రూంలో నల్లాలు లీక్ అవుతున్నాయి కాస్త రిపేర్ చేయించి పెట్టండి సార్. అలాగేనండి అంటూ ఫోన్ పెట్టేసారు ప్రసాద్ గారు. ప్రశాంత్ గారితో మాట్లాడుతుండగానే ఫ్లాట్ నెంబర్ 525లో కాపురం ఉంటున్న రాఘవయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రశాంత్ గారు ఫోన్ పెట్టేసిన తర్వాత రాఘవయ్య గారి కి మళ్ళీ కాల్ చేశాడు ప్రసాద్. రాఘవయ్య గారు ఫోన్ ఎత్తి నాయనా ప్రసాదు కాస్త నా మందులు అయిపోయాయి తెప్పించ పెడుదూ అంటూ నెమ్మదిగా మాట్లాడాడు. సరేనండి ఇప్పుడే పంపిస్తాను ఫోన్ పెట్టేసాడు ప్రసాద్. ఇలా ఉదయం నుంచి సాయంకాలం వరకు అందరి సమస్యలు తీర్చేఆపద్బాంధవుడు సదరు ప్రసాద్ గారు కూడా ప్లాట్ నెంబర్...