మర్యాద
మర్యాద పెళ్లి మండపం అందంగా మెరిసిపోతోంది. అది లక్షలు ఖర్చుపెట్టి చేయించిన కళ్యాణమండపం కాదు. అందంగా తోటలో దొరికే పూలు పళ్ళు కాయలతో తయారుచేసిన కళ్యాణమండపం. అదే పూల మండపం. సుముహూర్తం అయిపోయింది. ఆహ్వానితులంతా వధూవరులందరినీ ఆశీర్వదించారు. పంతులుగారి అనుమతి తీసుకుని కామేశ్వర రావుగారు భార్యతో కలిసి ఆహ్వానితులందరినీ పలకరించి వియ్యంకుడు గారి దగ్గరకు వెళ్లి" బావగారు శుభ ముహూర్తం అయిపోయింది కదా భోజనాలు ప్రారంభిస్తాం లేదంటే అందరూ వెళ్ళిపోతారంటూ చెప్పి వియ్యాలవారి పర్మిషన్ తీసుకుని తమ్ముడు నీ భార్యని పిలిచి వచ్చిన అతిథులకు స్నేహితులకి వియ్యాలవారికి బొట్టు పెట్టి భోజనానికి రండి అని గౌరవంగా పిలవండి ఎవరిని మర్చిపోవద్దు. చిన్నపిల్లలకు కూడా చెప్పాలి. ఇది మన ఆచారం అంటూ చెప్పి భోజనాల హాల్లోకి వెళతాడు కామేశ్వర రావు గారు భార్య సుందరితో కలిసి. కామేశ్వరరావు గారు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న మన సాంప్రదాయాలకి ఆచారాలకి పూజలకి పునస్కారాలనీ బాగా గౌరవిస్తాడు. ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. అది పెద్దలను చూసి నేర్చుకున్నది. గుమ్మoల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిని నవ్వుతూ పలకరించి మంచినీళ్లు తాగుతారా అ...