పోస్ట్‌లు

బొమ్మ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
బొమ్మ చెప్పిన కథ గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే ...