సీత జీవితం
సీత జీవితం ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది. పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...