మలి సంధ్య
మలి సంధ్య   నాడు నేను నీకు నవమాసాలు కని పెంచిన బిడ్డని నవనాడులు కుంగిపోయి నేడు నీవు నాకు అయ్యావు   బిడ్డగా. పురిటినొప్పులు లేని దేవుడిచ్చిన పసిబిడ్డవి.    నీది పేగుబంధం        నాది మాతృ రుణం.   నాకు అమ్మవే నిన్ను పసిబిడ్డలా మార్చింది కాలం.        నీ కాలంలో  నువ్వే నా కలల రాణివి.        ఇప్పుడు మనిద్దరి శరీరాలు ఒక్కటే        ఇంటి పేరు వేరు.         అమ్మా నా చిన్నతనం గుర్తు వస్తోందా నీకు    చెల్లి నీచంకలో,     నీ కొంగు పట్టుకుని నేను   ఇప్పుడు నా చంటిది చంకలో ,   నీమంచం పక్కన నేను పసితనంలో ఆనందంగా  నువ్వు చేయించే స్నానం నేను నీకు  ప్రతిరోజు చేస్తున్నాను కన్నీళ్లుతో అభిషేకం  అమ్మ ఎందుకిలా మారింది అని.. అగరుతో గుండ్రంగా నుదుటిన బొట్టు పెట్టి మురిసిపోయే అమ్మకి చుక్కలు లేని  ఆకాశంలా ఉండే నుదురు మీద రవ్వంత విభూది బొట్టు. తలుపు చాటు  వెళ్లి నేను వెక్కి వెక్కి ఏడ్చిన  క్షణం.  అది చూసిన నా ఓదార్పుకు సహకరించలేని నీ శరీరం నా చ...