పోస్ట్‌లు

సెప్టెంబర్ 3, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

రమణమ్మ మామిడి తోట

తెల్లవారుజామున 5:00 అయింది. ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని, ఆస్తి ఉండి కూలివాళ్లని పెట్టి వ్యవసాయం చేస్తూ, పశువులను పెంచుకుంటూ ఉండే ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు. అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి – "ఏవండీ మావయ్య గారు, ఈ స్థలం ఇలా వదిలేసారేటండి? ఇందులో మామిడి మొక్కలు పెంచండి. ఈ మట్టి అందుకు బాగా పనిచేస్తుంది" – అని ప్రతిరోజు సలహా ఇచ్చేవాడు. ఆ అన్నదమ్ములకు అందరికీ పొలం అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి, ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది. ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. "మాకు ఇప్పటికీ నలభై ఏళ్లు దాటిపోయాయి. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి?" – అనుకునేవారు. అన్నదమ్ముల పరిచయం ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు పెద్ద సుబ్బారావు. ఆయన యానంలో మన్యం మహాలక్ష్మి వారి సంస్థ...