పోస్ట్‌లు

జూన్ 12, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పాఠశాల తెరిచిన తొలి రోజులలో

ప్రతి సంవత్సరం జూన్ నెలతో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అసలు విద్యా సంవత్సరం అంటే ఏమిటి? పాఠశాలలు యూనివర్సిటీలు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్లీ తరగతులు , పరీక్షలు, సెలవులు జరిగే ఒక స్థిరమైన కాలాన్ని సూచిస్తుంది. ఏ విద్యార్థి కైనా సెలవులు ఉంటే సరదా. అందులో వేసవి సెలవుల తర్వాత తొలిరోజు పాఠశాలకు వెళ్లే పిల్లలు అంత ఉత్సాహంగా ఉండరు. ఇన్నాళ్ళు వేసవి సెలవుల మాధుర్యాన్ని అనుభవించి క్రమశిక్షణ జీవితానికి దూరంగా ఉండి తమ ఇష్టం వచ్చినట్లు ఆటలాడుకుని పాటలు పాడుకుని సినిమాలు షికార్లు వాళ్ళ ఇష్టం. అలా ఆనందంగా గడిపిన వేసవి సెలవు లను మర్చిపోలేక మళ్లీ స్కూలుకి వెళ్లాలంటే బెంగ బెంగగా ఉంటుంది పిల్లలకి. వేసవి సెలవులు అయిపోయి రెండు రోజులు ముందు నుంచి ఇంకా హాలిడేస్ ఇంకా రెండు రోజులే ఉన్నాయి అంటూ రోజు బెంగగా చెబుతుంటారు.  మరి పిల్లల పరిస్థితి ఇలా ఉంటే తల్లి తండ్రి పాత స్కూల్లో కంటిన్యూ చేయాలా కొత్త స్కూలుకు మార్చాలా కట్టవలసిన ఫీజులు కొనవలసిన పుస్తకాలు బస్సు ఫీజులు యూనిఫారం వీటన్నిటిని సమకూర్చుకునే హడావిడిలో ఉంటారు. ఆ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ విద్యా...

ఎయిర్ ప్యూరిఫైయర్

ఇంట్లో గాలి ఎలా ఉందో మీకు తెలుసా? చాలామంది దృష్టిలో గాలి నిశ్శబ్దంగా, కనబడకుండా ఉండే సహజ వనరుగా ఉంటుంది. కానీ నిజంగా చూస్తే, మన ఇంట్లో గాలిలోనూ అనేక రకాల ధూళి కణాలు, అలర్జీ కారకాలు, వాసనల కలుషితాలు ఉంటాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్ – మనం రోజులో అత్యధికంగా గడిపే స్థలం – ఆరోగ్యకరమైన గాలి కోసం విశేష శ్రద్ధ అవసరం. ఈ వ్యాసంలో, 120 చదరపు అడుగుల పరిమాణం గల సాధారణ బెడ్‌రూమ్‌కు సరిపోయే ఉత్తమ ఎయిర్ ఫిల్టర్లు గురించి వివరించాం 🧠 ఎయిర్ ఫిల్టర్లు ఎందుకు అవసరం? అలర్జీ నివారణ: ధూళి, పుప్పొడి ధాన్యాలు, పెంపుడు జంతువుల రొమ్ములు వాసనల తొలగింపు: వంటగది వాసనలు, పొగ, పెయింట్ VOCs నిద్ర నాణ్యత మెరుగుదల: శుద్ధమైన గాలి నిద్రలో గాఢతను పెంచుతుంది 📏 మీ గది పరిమాణానికి సరిపోయే ఎంపికలు: గది పరిమాణం: 12 ఫీటు x 10 ఫీటు = 120 sq.ft CADR అవసరం: సుమారు 100–150 CFM (Clean Air Delivery Rate) 🔝 బెడ్‌రూమ్‌కు ఉత్తమమైన 3 ఎయిర్ ప్యూరిఫయర్‌లు (2025లో) 1. Levoit Core 300S ✅ True HEPA + Activated Carbon ఫిల్టర్ ✅ Sleep Mode (22 dB తక్కువ శబ్దం) ✅ WiFi & Mobile App నియంత్రణ ✅ బడ్జెట్‌కు సరిపడే ధర 💸 ధర: ₹12,99 2. Coway AirMega 15...

శ్రీమతికి అక్షర బహుమతి

  అందరూ అడుగుతుంటారు మీ ఆయన ఏం బహుమతి ఇచ్చాడు నీ పుట్టిన రోజుకని! నిజానికి ఏం ఇవ్వాలి? ఇది మా తరానికి ఒక పెద్ద ప్రశ్న. జవాబు దొరకని ప్రశ్న. ఒక గులాబీ పువ్వు చేతిలో పెట్టి ఐ లవ్ యు అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. . షాజహాన్ లాగా ఒక తాజ్ మహల్ కట్టించే ఆర్థిక స్తోమత ఉండదు. కొత్త చీర కొనుక్కోమంటే ఇంట్లోనే కొత్త చీరలు ఉన్నాయి అంటారు. అంత పొదుపుగా ఉంటారు ఆడవాళ్లు. పోనీ మనమే ఇష్టమైన స్వీటు తయారుచేసి పెడదామంటే ఆ సామ్రాజ్యం మాది. మీరు మా రాజ్యంలోకి రాకూడదంటారు. బజారు స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఆ కేకు ముక్కలు ఫ్రిజ్లో పెట్టుకుని తింటారు. పోనీలెండి వాళ్ళ ఇష్టప్రకారమే కానిద్దాం. అది కూడా ఒక బహుమతి వాళ్లకి. నిజానికి ఒక యువకుడికి మంచి యువతి తో అలాగే ఒక యువతికి మంచి యువకుడితో వివాహం కుదర్చడం భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద బహుమతి వారిద్దరికీ. యువత జీవితంలో వివాహం అత్యంత ప్రాముఖ్యత ఉన్న షోడశ సంస్కారాల్లో ఒకటి. వివాహం తోటే జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది. ఒక మంచి భార్య కానీ భర్త గాని దొరికినప్పుడు.  అలాంటి భాగ్యలక్ష్మి లాటరీ నాకు తగిలిందని చెప్పాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. ...

ఒక సైనికుడి జీవితం

  " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్డు ఆ పొడుగు అంతా మీ ఆయన పోలికే అంటూ కొడుకు గురించి ఊరి ప్రజలు చెప్తుంటే ఉప్పొంగి పోయేది కావమ్మ. వాడు చేసే అల్లరి గురించి రోజు ఫిర్యాదులు వస్తుంటే తండ్రి లేని బిడ్డ కదా! సరిగా పెంచలేకపోతున్నానేమో అని రోజు మనసులో బాధపడేది నర్సయ్య గురించి. వీడికా చదువు సరిగా రాలేదు. వెనక చూస్తే ఆస్తిపాస్తులు లేవు. వీడి బ్రతుకు ఎలాగ ? అని బాధపడుతూ ఉండేది కొడుకు గురించి కావమ్మ. ప్రతి ఊర్లో కొంతమంది మంచి మంచి సలహాదారులు ఉంటారు. ఆ ఊర్లోని యువకులకి మంచి మంచి సలహాలిస్తూ వాళ్లని మంచి దారిలో పెట్టడం ఆయనకు హాబీ. అలా అచ్యుతరామయ్య కాళ్లు పట్టుకుంది తన కొడుకు గురించి కావమ్మ. ప్రతి వాళ్లు సలహాలిస్తుంటారు కానీ అవి అమలు చేయడానికి సహాయం చేయరు కానీ ఆ ఊరు హై స్కూల్ హెడ్ మాస్టర్ అచ్యుత రామయ్య మాత్రం సొంత ఖర్చులతో పక్కనున్న టౌన్ కి వెళ్లి అప్లికేషన్ తీసుకొచ్చి నరసయ్యని సైన్యంలోకి పంపడానికి అప్లికేషన్ పెట్టించాడు.  సహజంగా సైనికుడికి కావలసిన ప్రాథమిక అర్హతలన్నీ నరసయ్యలో ఉండడంతో నరసయ్య సైనికుడు అయిపోయాడు.  ట్రైనింగ్ పూర్తి చేసుకుని మిలట్రీ డ్రెస్ లో మెరిసిపోతూ ...