మార్పు
మార్పు నాన్న ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు. మా కొలీగ్ తల్లిదండ్రులందరూ  వచ్చి ఆరేసి  నెలలపాటు ఉంటారు. మీరేమో నా మాట వినరాయే. నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్  మాటలు విని చూద్దాం లేరా అoటు గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు. సురేష్ కిఅమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది. సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. చిరంజీవి గారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి . చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు భార్యలు మన వళ్ళతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నాడు చిరంజీవి గారు. సురేష్  చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి  అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి  కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు.  పెళ్లి కూడా అయ్యింది .ఇద్దరు పిల్లలు. పాపం  డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన. చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చ...