NTR జిల్లా విహార యాత్ర
ప్రముఖ చలనచిత్ర నటుడు , దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామరావు పేరు మీదుగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసినవి కొండపల్లి: ఇది ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. ఈ ఊరు బొమ్మలకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఇక్కడ కొండపల్లి కోట కూడా చూడదగినది. కనకదుర్గ గుడి: ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. బాపు మ్యూజియం: ప్రముఖ చిత్రకారుడు బాపు జ్ఞాపకంగా ఈ మ్యూజియానికి ఈ పేరు పెట్టడం జరిగింది. విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్ లో ఉంది. ఇక్కడ హిందూ బౌద్ధ మతాలకు చెందిన అనేక కళాఖండాలు ఈ ప్రదర్శనశాలలో ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్: విజయవాడలోని కృష్ణా నది నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ వలన ఎన్నో లక్షల ఎకరాలకి సాగు నీరు లభిస్తోంది. ఇంకా విజయవాడలో అనేక ప్రాంతాలు గాంధీ కొండ, భవాని ద్వీపం ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు. అమరావతి: విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాతవాహనుల కాలంలో నిర్మించిన అమరావతి స్తూపం అమరేశ్వర స్వామి ఆలయం చూడదగింది. ...