అచ్చులు
అచ్చులు అంటే ఇవి బెల్లపు అచ్చులు కావు. బెల్లపు అచ్చులంత తీయగా ఉండే తెలుగు భాషకు గుండెకాయ లాంటి తెలుగు  అక్షరాలు. తెలుగు భాషలో 56 అక్షరాలు. వీటిలో అచ్చులు హల్లులు  రెండు విభాగాలు.  ఈ అక్షరాలనుంచి వచ్చే అమృత తుల్యమైన పదాలు మన జీవితంతో చాలా ముడిపడి ఉంటాయి.   తెలుగు భాషలోని మొదటి*  అ * అనే అక్షరంతో ప్రారంభం అయ్యే అమ్మ అనే పదం ప్రతి మానవుడి జీవితానికి చాలా ముఖ్యమైంది. అమ్మ లేకపోతే మనం బొమ్మే. అమ్మ అంటే ప్రేమకు ప్రతిరూపం జీవనానికి ఆరంభం.  ఏదైనా అందమైన దృశ్యం చూసినప్పుడు గానీ పుష్పం చూసినప్పుడు గానీ  ఆకాశంలో హరివిల్లు ని చూసినప్పుడు కానీ మనసు తెలియని భావం కళ్ళ ద్వారా వ్యక్తపరుస్తుంది.  మొహం వెలిగిపోతుంది.  కష్టసుఖాలు పంచుకునే నిలయం ఇల్లు. ఆ ఇల్లు అనే పదంఇ అనే అక్షరంతో మొదలైంది సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుడు. ఈ అనే అక్షరం నాకు అందుకే చాలా గర్వం అంటుంది.  మన జీవితంలో ఆశ్రయం ఇచ్చే వాడు ఉపాధ్యాయుడు.జ్ఞానంతో మనసును వెలిగించే దీపమయ్యే ఆచార్యుడు లేకపోతే, మన జీవితం చీకటిలోనే మిగిలిపోతుంది.అందుకే ఉ అక్షరం జ్ఞానానికి ప్రతీక. అమ్మతనం అంటే ఊయల.శిశువు ఊయలలో తల్లి పాటలు విని పెరుగుతుంద...