పోస్ట్‌లు

నోము లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నోము

నోము సాయంకాలం నాలుగు గంటలు అయింది. చీకటి పడిపోతుందని ఒకటే భయం. ప్రతిరోజు చీకటి పడుతుంది. చీకటి అంటే భయం కాదు. ఇంకా గిన్నెలో సగం పైగా ప్రసాదం ఉండిపోయింది వచ్చే వాళ్ళు ఎవరూ కనబడటం లేదు.  ఎలాగా ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాబోలు అనుకుంటూ దేవుడికి అనేక దండాలు పెట్టుకుంటూ ఆ అగ్రహారంలో ప్రతి ఇంటికి ఇద్దరు మనుషులను పంపించి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో అని లేదంటే ఇంట్లో ఉన్నవాళ్లు ప్రసాదం తినడానికి రాకుండా ఉండిపోయారేమో అని ఎంక్వయిరీ చేస్తూ ఎదురుచూస్తోంది సీతమ్మ. ఆ ఊరికి వచ్చే ఆఖరి బస్సు ఐదు గంటలకు వస్తుంది. ఆ బస్సులో ఎవరింటికైనా చుట్టాలు రాకపోతారా అని ఆశగా చూస్తోంది. సాధారణంగా స్త్రీలు ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. ప్రతి నోము కి ఒక రకమైన నియమం ఉంటుంది. మరి సీతమ్మ గారు పట్టి న నోము పేరు చెప్పలేదు కదా. అదేనండి నంది కేశుడి నోము అన్నీ అయిపోయాయి కానీ ఒక్క సెనగలు మాత్రం మిగిలిపోయాయి సీతమ్మ గారికి. సూర్యాస్తమయం అయ్యే లోగా ఆ ప్రసాదం చెల్లిపోవాలి. ఇదివరకు ముందుగా వినాయకుడు పెట్టిన ఉండ్రాళ్ళు మధ్యాహ్నానికే చెల్లిపోయా యి.  కాలభైరవుడికి పెట్టిన గారెలు కూడా ఉదయం టిఫిన్ సమయానికి పిలిచి పెట్ట...