పోస్ట్‌లు

ఫిబ్రవరి 15, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

సూత్రధారి

నీ లీలారంగంలో పాత్రనై పుట్టాను, నీ కరుణాకటాక్షంలో శరణాగతినై నిలిచాను, నీ పాదపద్మాల చెంత విశ్రాంతినై లీనమయ్యాను. నేను నీ సంకల్పసూత్రాలకు కట్టుబడిన కీలుబొమ్మను; తెరపై తెల్లవారుజామునే నాట్యం ఆరంభింపజేసేది నీవే, తెరదించి నాటకసమాప్తి ఘడియను నిర్ణయించేది నువ్వే. తెరపై నటనకు “మహానటుడు” అనే మహిమాబిరుదులు నీవే ప్రసాదిస్తావు, ఆ బిరుదుల మత్తులో నేను ఉప్పొంగి ఉరకలేస్తాను; పాత్రపరిసమాప్తి వేళ మెడలో పూలహారాలు వేయిస్తావు, ఆ హారాల పరిమళంలో కూడా నీ చిత్తమే దాగి ఉంటుంది. నేను క్షణిక పాత్రధారిని — నీవు శాశ్వత సూత్రధారివి నేను నటనలో నిమగ్నుడను  నీవు లీలలో పరిపూర్ణుడవు. నా ఆరంభం నీ సంకల్పం, నా ముగింపు నీ మౌనం. నటించిన ప్రతి క్షణమూ నీకర్పణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279