సూత్రధారి
నీ లీలారంగంలో పాత్రనై పుట్టాను,
నీ కరుణాకటాక్షంలో శరణాగతినై నిలిచాను,
నీ పాదపద్మాల చెంత విశ్రాంతినై లీనమయ్యాను.
నేను నీ సంకల్పసూత్రాలకు కట్టుబడిన కీలుబొమ్మను;
తెరపై తెల్లవారుజామునే నాట్యం ఆరంభింపజేసేది నీవే,
తెరదించి నాటకసమాప్తి ఘడియను నిర్ణయించేది నువ్వే.
తెరపై నటనకు “మహానటుడు” అనే మహిమాబిరుదులు నీవే ప్రసాదిస్తావు,
ఆ బిరుదుల మత్తులో నేను ఉప్పొంగి ఉరకలేస్తాను;
పాత్రపరిసమాప్తి వేళ మెడలో పూలహారాలు వేయిస్తావు,
ఆ హారాల పరిమళంలో కూడా నీ చిత్తమే దాగి ఉంటుంది.
నేను క్షణిక పాత్రధారిని —
నీవు శాశ్వత సూత్రధారివి
నేను నటనలో నిమగ్నుడను
నీవు లీలలో పరిపూర్ణుడవు.
నా ఆరంభం నీ సంకల్పం,
నా ముగింపు నీ మౌనం.
నటించిన ప్రతి క్షణమూ నీకర్పణం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి