పోస్ట్‌లు

ముందు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  "ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు ?నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ ...