రాఖీ పండుగ
రాఖీ పండుగ ఉదయం 9 గంటలయింది రామరాజు ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో బిజీబిజీగా ఉన్నాడు. రామరాజు మలక్ పేట్ లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నత ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎప్పుడు ఆఫీసుకి 9 గంటలకే బయలుదేరుతాడు ఏవండీ రేపు ఆఫీస్ కి రెండు గంటలు ఆలస్యంగా వస్తానని పరిమిషన్ తీసుకోండి అంటూ భార్య సరోజ వంటింట్లోంచి గట్టిగా అరిచింది. ఏమిటి విషయం అంటూ భార్యని ప్రశ్నించాడు రామరాజు. రేపు రాఖీ పౌర్ణమి అండి. మీ చెల్లెలు రాఖీ కట్టడానికి వస్తానని నిన్ననే ఫోన్ చేసి చెప్పింది అంటూ సమాధానం ఇచ్చింది. రామరాజుకి ఒక్కగానొక్క చెల్లెలు సుమతి కూడా అదే ఊర్లో వనస్థలిపురం లో ఉంటుంది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి తప్పకుండా ఇంటికి వచ్చి అన్నగారికి రాఖీ కట్టి వెళుతుంది. ఉత్త రోజుల్లో మొబైల్లో పలకరించుకోవడం తప్ప రాకపోకలు ఉండవు. ఒకే సిటీలో ఉంటున్న ఎవరి పనులు , ఎవరి హడావుడి వారిది. ఉదయం లేచిన దగ్గర్నుంచి పరుగే. ఎవరిని ఏం అనడానికి లేదు . రామరాజు మాత్రం ప్రతి ఆదివారం చెల్లెలికి ఫోన్ చేసి క్షేమమాచారాలుతెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లి పలకరించే తీరుబడి ఇద్దరికీ ఉండదు. రామరా...