పోస్ట్‌లు

పోలీస్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాజశేఖర్

రాజశేఖర్. ఉదయం 9.00 అయింది.  కాకినాడలో భానుగుడి సెంటర్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అటు మెయిన్ రోడ్డు వైపుకు వెళ్లే వాహనాలు బస్సు కాంప్లెక్స్ కి వెళ్లే వాహనాలు ఇటు పిఠాపురం వెళ్లే వాహనాలు కాలినడకని వెళ్లేవాళ్లు స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఆటోలు మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్లతో రద్దీగా ఉంది. స్కూలుకు వెళ్లే పిల్లలు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు తో హడావిడిగా ఉంది రోడ్ అంతా.  అటు జనానికి ,ఇటు వాహనాలకి దిశా నిర్దేశం చేస్తూ ఎండని తట్టుకుంటూ కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిలా తన విధి నిర్వహణ చేస్తున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్. అన్ని రంగాల్లో యాంత్రికరణ పెరిగినట్లు నగరంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ లైట్లు పెట్టిన విధి నిర్వహణ మాత్రం కత్తి మీద సాము లాంటిది ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి. అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు కానీ పాటించే వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ ఒకటే తొందర అందరికంటే ముందు గమ్యం చేరాలని. పోటీ తత్వం పెరిగిపోయి యువతరం, ఆఫీసులకు ఆలస్యం అవుతుందని ఒక తరం ఇలా ఎవరు తొందర వారిది.  ఏదైనా జరగకూడని జరిగితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంతే. పాపం ఎంకి పెళ్లి సుబ్బి చావు...