కన్యాశుల్కం
కన్యాశుల్కం మానవుడు ఊహనుంచి పుట్టిందే కవిత్వం. ఏ కళ అయినా కూడా మనిషి ఊహనుంచి పుట్టినవే. ఊహ ఎంత గొప్పది. ఆ ఊహకి ఆధారం చుట్టూ ఉండే సమాజం, సమాజంలోని లోటుపాట్లు కావచ్చు. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య మీద ఆకలి రాజ్యం వంటి చలనచిత్రం రూపుదిద్దుకుంది. అలాగే వరకట్నం మీద అనేక రచనలు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఒక ప్రియుడు తన ప్రియురాలు విరహ వేదన భరించలేక మేఘముల ద్వారా సందేశం పంపుతాడు. అదే కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యం. ఇది నిజంగా జరిగింది కాదు. కానీ కవి ఊహించి వ్రాసింది. అలాగే లంచగొండితనం మీద అనేక సాంఘిక చలనచిత్రాలు వచ్చాయి. ఆనాటి సంఘంలో ఉన్న సాంఘిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక అద్భుతమైన నాటక కళాఖండాన్ని తయారు చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు గారు. ఆ రోజుల్లో కన్యకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. ఒక విధంగా కన్యను కొనుక్కున్నట్లే. పది పన్నెండు సంవత్సరముల వయస్సులోనే ఆడపిల్లలు కన్యాశుల్కానికి బలి అవుతుండేవారు. కాటికి కాళ్లు చాచుకుని ఉండే ముదుసలి కూడా పునర్వివాహం చేసుకునేవారు. అలా ఎందరో పసి మొగ్గల జీవితాలు నాశనం అవుతుండేవి. ఆ ముసలి ప్రాణం కాస్త గుటుక్కుమ...