రాజు గారి కోట
రాజరికం చరిత్రలో కలిసిపోయింది
రాజ్యాలు దేశంలో కలిసిపోయే యి
గతించిన చరిత్రకు సాక్షిగా రాజులు కట్టిన కోటలు మిగిలిపోయాయి. రాజుల జ్ఞాపకాలు, రాజ్యాల వైభవాలకు గుర్తుగా మిగిలిపోయిన కోటలు ఎప్పటికీ మనకి అపురూపమే. అవి ఈనాడు శిధిలమై ఉండొచ్చు, దుమ్ము పేరుకుపోయి ఉండొచ్చు అవి మన చారిత్రక సంపద అనడంలో సందేహమే లేదు.
ఆ కాలపు వైభవాన్ని తనివి తీరా అనుభవించిన అది భవనం
కాదు రాజుల గత వైభవం తనివి తీరా దర్శించి ప్రశ్నిద్దాం. అది మాటలు వచ్చిన మనిషి కాదు సమాధానాలు ఎలా చెబుతుందని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఆ కోటలో ప్రతి గదికి ఒక చరిత్ర. ప్రతి గది ఒక ప్రయోజనం కోసం నిర్మించబడింది. ఇది ఒక రాజ్యానికి సంబంధించిన కోట కాదు . రాజు గారి కోట అంటే రాళ్లతో కట్టిన భవనం కాదు. అది ఒక యుగపు గౌరవం, జీవన విధానం, కళాత్మకత, అన్నీ అందులో కనిపిస్తాయి. ఆ కోట దగ్గరికి వెళ్లి ప్రాకారాలు నిమిరి ఎలా ఉన్నావ్ అని ఆప్యాయంగా పలకరిస్తే ఇదిగో ఇలా ఉన్నానని దుమ్ము కొట్టుకుపోయిన గదిని చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించింది.
నేను — ఒక కోటను. రాళ్లతో, సున్నంతో, చెమటతో, శౌర్యంతో పుట్టిన జీవిని.శతాబ్దాల క్రితం, ఒక గర్విత రాజు నన్ను నిర్మించాడు. యుద్ధంలో గెలిచి తిరిగొచ్చినప్పుడు, తన విజయానికి గుర్తుగా నా మొదటి రాయి వేసాడు.శిల్పులు తమ చేతులతో నన్ను మలిచారు. వారు చెక్కిన ప్రతి స్తంభం మీద వారి కళ, వారి శ్రమ మిగిలి ఉంది.
ఒకప్పుడు నా గోడలమీద జెండాలు ఎగురేవి.నా బురుజులమీద సైనికులు కాపలా కాసేవారు.నా లోపల రాజసభలో శంఖాలు ఊదేవి, డప్పులు మోగేవి, మంత్రుల మాటలు గంభీరంగా మారుమ్రోగేవి.
రాజు రాణుల సొబగులు, పండుగల హంగులు, సంగీత నృత్యాల కాంతులు — ఇవన్నీ నా కళ్ల ముందు జరిగిన అద్భుతాలు.
నా రహస్య మార్గాల్లో ఎన్నో కుట్రలు పుట్టాయి.నా గోడల వెనుక ప్రేమలు వికసించాయి, వీరులు మరణించారు.
ఒక కాలంలో నేను జీవం ఉన్న రాజ్యంలా ఉండేవాడిని — ప్రతి రాయి మాట్లాడేది, ప్రతి ద్వారం ఊపిరి తీసుకునేది. కోట అంటే మామూలు భవనం కాదు. అది ఒక అడుగు పెట్టడానికి వీలు లేని భవనం.
కోటలో అనేక భాగాలు. ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకత. ఒక్కొక్క చరిత్ర. ఒక్కొక్క ప్రత్యేక అవసరానికి నిర్మించబడింది అంటూ ఎత్తైన గోపురం లా ఉన్న మహాద్వారం తలుపులు తెరిచి లోపలకు ఆహ్వానించింది. విచిత్రం కోట చుట్టూ నీటి గుంట అదేంటని ఆశ్చర్యంగా అడిగితే కోట అంటే రాజుగారి భవనం ఒకటే కాదు శత్రువులు సులువుగా ప్రవేశించడానికి వీలు లేకుండా ఇది ఒక రక్షణ కవచమని గర్వంగా చెప్పింది. ఎంత దూరదృష్టి ఆ కాలం రాజులది. అది దాటుకుంటూ ముందుకు నడుస్తుంటే పైన కోట చుట్టూ నాలుగు మూలల ఉండే రక్షణ గోపురాలను చూపించింది. ఒకప్పుడు అక్కడినుండి తుపాకీలు బాణాలు ప్రయోగించేవారిని అవి కాపలాదార్లకి మేడలుగా ఉండేవని గర్వంగా చెప్పింది.
కోట చుట్టూ అందమైన ఎత్తైన గోడలు రక్షణ వలయాలు సైనికుల కాపలాలు శత్రువుల దాడి నుండి రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ అవి సరే మరి అసలు రాజమహల్ లో కి అడుగుపెడదాం అంటూ ముందుకు సాగింది.
సశేషం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి