రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం. నేను ఎందుకు ప్రత్యేకo ఎన్నిసార్లు పేర్లు మారినా నేను రాజరాజ నరేంద్రుని రాజధానినే చరిత్ర ఎవరు చెరిపేయగలరు ఒకళ్ళ ఇద్దరా ఎన్ని రాజవంశాలు నన్ను నడిపించాయో ఎంతో మంది కవులు ఎంతోమంది సంఘసంస్కర్తలు తీర్చిదిద్దిన సాంస్కృతిక రాజధానిని రాజమండ్రి ని గాలిలో ఎగురుకుంటూ వచ్చేవాళ్లు జాతీయ రహదారిపై రివ్వున దూసుకు వచ్చేవాళ్ళు చుకు చుకు బండి దిగేవాళ్లు షికారుగా బోటు లో రోజు ఎంతోమంది అంతకంటే ముఖ్యం ఏ నగరానికి లేని అదృష్టం గలగల పారే గోదావరి నా పక్కన ఉండడం ఎప్పటి బిపిన్ చంద్రపాల్ ఇప్పటికీ గాలిలో ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది నా నగరంలోని పాల్ చౌక్ లో అదేనండి కోటిపల్లి బస్టాండ్ బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినా కలెక్టర్ గారి పేరు మీదుగా నా నగరంలో ఇన్నిసుపేట మిగిలిపోయింది. అక్కడ అందమైన పూల తోటలు లేవు. మనసును మల్లెపూలలా మార్చే దివ్యజ్ఞాన సమాజం నాయకుడు ఆల్కాట్ పేరుతో ఏర్పడిన వీధి ఆల్కాట్ గార్డెన్స్ ఆ రామదాసు రామ భక...