పోస్ట్‌లు

సాఫ్ట్వేర్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సాఫ్ట్వేర్ వ్యవసాయం

 సాప్ట్ వేర్ వ్యవసాయం. " ఏరా నీకు ఇంకా ఎన్ని రోజులు సెలవు ఉంది? అంటూ ప్రశ్నించాడు రామయ్య దసరా పండక్కి ఇంటికి వచ్చిన తన కొడుకు రమేష్ నీ. దసరా పండగ వెళ్లిపోయి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది అయినా రమేషు ఊర్లోనే ఉండిపోవడం చూసి. ఎప్పుడు పండగ మర్నాడు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడు సెలవు లేదంటూ! మరి ఈసారి ఏమైంది? ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా! అనుకుని ఆలోచనలో పడ్డాడు రామయ్య.  " లేదు నాన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసా ను. మన సొంత ఊళ్లోనే ఉండి నీతో పాటుగా వ్యవసాయం చేసుకుంటారు ను అంటూ సమాధానం చెప్పిన కొడుకుని అయోమయంగా చూశాడు రామయ్య. అదేమిటి రా బంగారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ఏమిటి? నీకు గాని మతి పోయిందా! వ్యవసాయం అంటే మాటలా! చిన్నప్పటినుంచి నా బాధలు చూస్తున్నావు కదా! అంటూ చెప్తున్న తండ్రి మాటలు వినిపించుకోకుండా లేదు నేను ఇంకా ఉద్యోగం చేయలేను. నావల్ల కావడం లేదు. షిఫ్ట్ డ్యూటీ ఉద్యోగాలు చేయలేను. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా ఆలస్యం అయిపో తోంది. దానికి తోడు కుర్చీలో కదలకుండా కూర్చుని ఆ కంప్యూటర్ వైపు చూస్తూ పనిచేయడంతో కళ్ళు కాళ్ళు కూడా వాచిపోతున్నాయి. ఏదో ఆకల...