ఆణిముత్యం
మనిషి భావాలను ప్రత్యక్షంగా ఆవిష్కరించే సమగ్ర కళ నాటకం. కేవలం చదివే సాహిత్యంతో పోలిస్తే, నాటకం కళ్ల ముందు కదిలే కవిత్వం. ఇందులో కథ, సంభాషణ, నటన, సంగీతం, వేషధారణ, వేదిక—అన్నీ కలిసిపోతాయి. అందుకే దీనిని దృశ్యకావ్యం అంటారు. ఈ కళ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకుడికి వినోదం అందించడమే కాకుండా సమాజ ప్రయోజనం కూడా రచయిత ఆశించేవాడు అప్పట్లో. ఆనాడు సమాజంలో ఉండే దురాచారాలు కథా వస్తువుగా తీసుకుని నాటకాలు వ్రాసేవారు. గురజాడ వారి కన్యాశుల్కం ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది అయితే కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకం మరొక సాంఘిక దురాచారం గురించి సమాజానికి తెలియజేసింది. ఒక రచయిత రచన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ రచయిత గురించి కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఈ నాటక రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు గోదావరి జిల్లాలలో జన్మించిన రచయితలలో ఒకరు. వృత్తిరీత్యా అధ్యాపకుడైనప్పటికీ సంఘసంస్కరణ అంటే మక్కువ. అందుకే ఆనాటి సంఘంలోని దురాచారాల్ని ఖండిస్తూ వరవిక్రయం నాటకం తో పాటు వేశ్యవృత్తిని ఇతివృత్తంగా చేసుకుని చింతామణి అనే నాటకం కూడా వ్రాశారు. ఈ చింతామణి అనే నాటకం తెలుగు నాట ప్రదర్శించబడని వీధి ఉ...