మన కథ ఆడనే ప్రారంభం
మన కథ అక్కడే ప్రారంభం. " ఆడదే ఆధారం మన కథ ఆడనే ప్రారంభం అంటూ ఎక్కడో పాట వినిపిస్తోంది. నిజమే ఇది అక్షర సత్యం. మగవాడు ఉనికికి గమనానికి అభివృద్ధికి ఆడదే ఆధారం. ఆమె లేకపోతే బ్రతుకు శూన్యం. ఇది ప్రతి మహిళా దినోత్సవం నాడు చెప్పుకునే మాట కాదు. నిరంతరము తలుచుకోవాల్సిన మాట. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్ల అందచందాలు చూసి కళకళలాడుతూ లక్ష్మీదేవి లా ఉంది అని అంటారు. ఇంటికి ఇల్లాలు అందం. నిజమే ఇల్లాలు లేని ఇల్లు బోసిపోతుంది. వెలవెలబోతుంది. ఇల్లాలు తోటే ఆ ఇంటికి అందం. ఆ కుటుంబానికి ఆనందం. నిజజీవితంలో ఒక కుటుంబంలో ఆమె పాత్రను పరిశీలిస్తే అష్టలక్ష్మి తత్వం కనబడుతుంది. ఆ కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం ఆమె పడే శ్రమ వెనుక ఉన్న ఆదర్శ మూర్తులు ఎవరని అడిగితే అష్టలక్ష్మిలు అని నా ఉద్దేశం. ఒక ఇంటికి ఇల్లాలు అందం. ఆ ఇంటిలో ఉండే వారి ఆపదలన్నీ తీర్చడానికి ఆనందంగా ఉంచడానికి ఆమె అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేతులలో ఆ కుటుంబానికి అభయ వరముద్రలు ఉంటాయని అనిపిస్తుంది. ఆమె కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇకపోతే ఆ ఇల్లు ఎప్పుడు పిల్ల...