పోస్ట్‌లు

నాన్న లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నాన్న లాగ ఎవరు ఉంటారు!

" నాన్న రేపు నీ పుట్టినరోజుకి ఒక టీ షర్టు కొనుక్కుందాం పద అంటూ కొడుకు శరత్ చెప్పిన మాటలకు తల అడ్డంగా ఊపి వద్దురా నాకు ఇంట్లో బోల్డ్ బట్టలు ఉన్నాయి. అయినా టీ షర్ట్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అదేమిటి నాన్న నీ వయసు వాళ్ళు అందరూ టీ షర్ట్లు వేసుకుంటున్నారు కదా! . "అది వాళ్ళ ఇష్టం. "నా పుట్టినరోజు కంటూ నువ్వేమీ ప్రత్యేకంగా కొనకు అంటూ నిక్కచ్చిగా చెప్పేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు పరంధామయ్య.  పరంధామయ్య మండల ఆఫీసులో ఒక చిరుద్యోగి. లంచాలు వచ్చే ఉద్యోగం అయినా పది పైసలు ఎవరి దగ్గర పుచ్చుకోకుండా చాలా నిక్కచ్చిగా పని చేస్తాడు. చాలా సాదాసీదాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పిల్లలు ఇద్దరు పై చదువులకు వచ్చిన ఎవరిని పది పైసలు అడగకుండా తన కు వచ్చిన జీతంతోనే పిల్లలు ఇద్దరిని చదివించుకుంటున్నాడు. రోజు ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతుంటాడు.  ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకెళ్ళి మళ్లీ ఇంటికి వచ్చేవరకు ఏది ముట్టుకోడు. అంతా లెక్కలు వేసుకుని జీవితం గడుపుతూ ఉంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తెలుపు బట్టలే గాని ఎప్పుడు రంగు బట్టలు వేసుకుని ఎరగడు. ఏది తక్కువగా వస్తే అదే కొనుక్కుంటాడు. కానీ తన మీద ఆధార...

నాన్న

నాన్న ఓ అభయ హస్తం. నాన్న అంటే ఒక నిస్వార్ధం నాన్న ఒక మార్గదర్శి. ఆఫీసులో బండెడు చాకిరీ చేసి ఇంటికి వచ్చి నవ్వుతూ పిల్లలు పలకరించేవాడు నాన్న తన జేబు ఖాళీగా ఉన్నా పిల్లల గొంతెమ్మ కోరికలు నిరంతరం తీర్చే వాడే నాన్న. తను సైకిల్ మీద ఉసూరుమంటూ ఆఫీస్ కి వెళ్తున్నా తన పిల్లల కోసం స్కూటీలు కొనిచ్చి వాడే నాన్న. తాహతుకు మించిన ఫీజులు పెట్టి గురుకుల విద్య నేర్పి తల తాకట్టు పెట్టి పరదేశంలో విద్య నేర్పించి ఉపాధి కల్పించి గ్రీన్కార్డు వచ్చిందంటూ పిల్లలు చెప్పే టాటాలు తో మురిసిపోతూ తన బ్రతుకు పల్లెటూరి కొంప లోనే వెళ్లదీస్తూ చాలీచాలని పెన్షన్ రాళ్లతో పచ్చడి మెతుకులు పరమానందంగా తింటూ అన్ని కూరలు ఆరోగ్యానికి సరిపడవు అంటూతన లేనితనాన్ని కప్పి పుచ్చుకుంటూ గుంభనంగా జీవితాన్ని సాగించే వాడే నాన్న.  రెండు లేదా మూడు సంవత్సరాల కోసారి పరదేశం నుండి వచ్చే మనవలు కోసం ఏసీ కొనమనిచెప్పే భారీ మాటలని, భార్య మాటలని సున్నితంగా తోసిపుచ్చి ఎందుకు మన అరుగు మీద మడత మంచం వేసుకుని పడుకుంటే చల్లని గాలి వేస్తుంది అంటూ చెప్పిన మాటలు నాకు నాన్నలో ఓ పొదుపరి కనిపిస్తాడు. చరిత్ర నాన్న పాత్రకి ద్వితీయ స్థానం కల్పించినా భార్యక...