పెళ్లి
పెళ్లి " నాన్న ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రి కిచూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీడీ చదువుకుంది రా మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి మీ ఇద్దరికీ ఎలాకుదురుతుంది పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోoది. లేదునాన్న టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళ కి. బోల్డన్ని సెలవులుఉంటాయి . పైగా టైమింగ్ లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే పెళ్లిచూపులుకి వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని తొందరపెట్టాడు రఘు. రఘురామయ్యగారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు కూతురులు ఇద్దరినీ బిఎస్సి బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య పెళ్లి కొడుకు ,పెళ్లి కొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి...