పక్షులు నేర్పే పాఠాలు
పక్షులు నేర్పే పాఠాలు ఈ విశాల ప్రపంచంలో మన చుట్టూ మనతో పాటే సహజీవనం చేసేవి పక్షులు. దేవుడిచ్చిన రెండు కాళ్ళతో జీవిత గమనం సాగించేవాడు మాట తెలిసిన మనిషి. రెండు కాళ్లతో పాటు రెక్కలు కూడా ఉండి మూగజీవులుగా పిలవబడుతూ గగన మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతూ తన జీవనయానo సాగించేవి పక్షులు. తెల్లవారి లేస్తే ఆకాశంలోనూ చెట్టు కొమ్మల మీద మన ఇంటి చూ రులోనూ పక్షులు కనబడి విచిత్రమైన ధ్వనులు చేస్తూ మన మనసుకి ఆనందం కలగజేస్తాయి. పక్షుల నుండి మనం నేర్చుకోవాల్సింది అనేకం ఉన్నాయి. అవి చిన్న జీవులు కావచ్చు, కానీ వాటి జీవనశైలి, సహజ నైపుణ్యాలు, సమయపట్టిక, త్యాగం, సహనం వంటి అంశాలు మన జీవితానికి గొప్ప పాఠాలు. 1. స్వేచ్ఛా జీవనం – స్వతంత్రతకు విలువ పక్షులు ఎవరినీ అడగకుండా ఆకాశంలో విహరిస్తాయి. మనకూ మన అభిప్రాయాలకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్రంగా జీవించడం ఒక గొప్ప గుణం. 2. సమయపాలన (Discipline) పక్షులు సాయంత్రం సంధ్యాకాలానికి ముందే గూళ్లలోకి చేరుతాయి. ఉదయాన్నే కుక్కులు, కోయిలలు మొదలు పాడటం ప్రారంభిస్తాయి. ఇది మనకు సమయపాలన పాఠాన్ని నేర్పుతుంది. 3. కృషి మరియు ధైర్యం ఒక చిన్న పక్షి ఎన్నో సార్లు కిందపడినా ఎగరడం నేర్చుకుం...