పక్షులు నేర్పే పాఠాలు

పక్షులు నేర్పే పాఠాలు

ఈ విశాల ప్రపంచంలో మన చుట్టూ మనతో పాటే సహజీవనం చేసేవి పక్షులు. దేవుడిచ్చిన రెండు కాళ్ళతో జీవిత గమనం సాగించేవాడు మాట తెలిసిన మనిషి. రెండు కాళ్లతో పాటు రెక్కలు కూడా ఉండి మూగజీవులుగా పిలవబడుతూ గగన మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతూ తన జీవనయానo సాగించేవి పక్షులు. 

తెల్లవారి లేస్తే ఆకాశంలోనూ చెట్టు కొమ్మల మీద మన ఇంటి చూ రులోనూ పక్షులు కనబడి విచిత్రమైన ధ్వనులు చేస్తూ మన మనసుకి ఆనందం కలగజేస్తాయి. 

పక్షుల నుండి మనం నేర్చుకోవాల్సింది అనేకం ఉన్నాయి. అవి చిన్న జీవులు కావచ్చు, కానీ వాటి జీవనశైలి, సహజ నైపుణ్యాలు, సమయపట్టిక, త్యాగం, సహనం వంటి అంశాలు మన జీవితానికి గొప్ప పాఠాలు.

1. స్వేచ్ఛా జీవనం – స్వతంత్రతకు విలువ

పక్షులు ఎవరినీ అడగకుండా ఆకాశంలో విహరిస్తాయి. మనకూ మన అభిప్రాయాలకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్రంగా జీవించడం ఒక గొప్ప గుణం.

2. సమయపాలన (Discipline)

పక్షులు సాయంత్రం సంధ్యాకాలానికి ముందే గూళ్లలోకి చేరుతాయి. ఉదయాన్నే కుక్కులు, కోయిలలు మొదలు పాడటం ప్రారంభిస్తాయి. ఇది మనకు సమయపాలన పాఠాన్ని నేర్పుతుంది.

3. కృషి మరియు ధైర్యం

ఒక చిన్న పక్షి ఎన్నో సార్లు కిందపడినా ఎగరడం నేర్చుకుంటుంది. ఇది మనకూ ప్రతి ప్రయత్నంలో పట్టుదల అవసరం అని గుర్తు చేస్తుంది.

4. సహనం మరియు త్యాగం

తల్లి పక్షి తన పిల్లలను రక్షించేందుకు తన ప్రాణాలనైనా పణంగా పెడుతుంది. ఇది త్యాగం అంటే ఏమిటో మనకు నేర్పిస్తుంది.

5. సహజానుకూలత (Adaptability)

పక్షులు వాతావరణాన్ని బట్టి నివాసాన్ని మార్చుకుంటాయి, వలసలు వెళ్తాయి. మనమూ జీవితం మారినప్పుడు ఆ మార్పులకు తగినట్లుగా నడవాలి

6. శ్రమించి గూడు కట్టడం – ఇంటికీ విలువ

ఒక చిన్న పిట్ట ఎన్నోరోజుల పాటు చిన్నగా ఒక్కొక్క పొదను తెచ్చి గూడు కడుతుంది. ఇది కుటుంబ నిర్మాణం, కృషితో నెమ్మదిగా ఎదగడం అనే పాఠాన్ని నేర్పుతుంది.

7. గానం – జీవితం హర్షదాయకం చేయాలి

పక్షుల మధురగానం మన మనసును ఉల్లాసపరుస్తుంది. మనమూ మాటలతో, వాక్చాతుర్యంతో ఇతరులను సంతోషపరచగలగాలి.

8. సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం

పక్షులు పువ్వుల మధ్య, చెట్లపై, ప్రకృతిలో విహరిస్తూ జీవిస్తాయి. మనం ప్రకృతిని గౌరవించి, దాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి.

9. చిన్నదైనా లక్ష్యంతో జీవించటం
చిన్న పిట్ట పెద్ద ఆశలతో గూడు కడుతుంది. మనం కూడా జీవితంలో ఎంత చిన్న స్థితిలో ఉన్నా పెద్ద ఆశయాలు కలిగి ఉండాలి.

10. సహజ నియమాలకు విధేయత
పక్షులు ప్రకృతి చక్రానికి అనుగుణంగా జీవిస్తాయి – వర్షాకాలంలో గూడు కట్టటం, శీతాకాలంలో వలస వెళ్లటం వంటి చర్యలన్నీ ప్రకృతిని గౌరవించడమే. మనం కూడా ప్రకృతికి హాని చేయకుండా జీవించాలి.

11. వనరుల్ని విభజించుకోవడం (Sharing)
చాలా పక్షులు తమ గూళ్ల చుట్టూ ఇతర పక్షుల్ని కూడా సహించగలవు. ఇది మనకు సహజ సహజీవనాన్ని నేర్పుతుంది.

12. పునరుద్ధరణ (Resilience)
ఎన్ని వర్షాలు పడినా, గూడు చెదిరినా, పక్షి మళ్లీ కొత్తగా కట్టుకుంటుంది. మనమూ జీవితంలో ఎదురయ్యే దెబ్బల నుంచి మళ్లీ లేచి నిలబడగలగాలి.

13. కుటుంబ బంధాలకు విలువ
తల్లి పక్షి పిల్లల కోసం ఆహారం తెచ్చి పెడుతుంది, కాపాడుతుంది. ఇది ప్రేమ, బంధం, బాధ్యత అనే గుణాల్ని బోధిస్తుంది.

14. సంచారం – కొత్త ప్రాంతాల అన్వేషణ
వలస పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి కొత్త ప్రదేశాలను చేరతాయి. మనం కూడా జీవితంలో ఒకే చోట ఉండకుండా కొత్త విషయాలను అన్వేషించాలి, నేర్చుకోవాలి

ఆ మూగజీవుల జీవితాన్ని పరిశీలిస్తే ఇన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం దొరికినప్పటికీ అవి మనల్ని చూడగానే ప్రాణ భయంతో తుర్రున పారిపోతాయి.  

అవి ప్రాణభయంతో పారిపోయిన మనకి వాటితో సహజీవనం చేయడం చాలా ఇష్టం. అందుకే అందమైన రామచిలుకలను పంజరంలో పెట్టి పోషించి మాటలు నేర్పుతాము. మన ఇంటి చూరులో పిచుక గూళ్ళు చూసి మురిసిపోతాము. ధాన్యపు కుచ్చులని మన ఇంటి చూ రుకి కట్టి వాటి ఆహార కొరత తీరుస్తాము. నెమలిని చూడగానే మన మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది. 

పావురాలు ఒకప్పుడు పోస్ట్ మెన్ డ్యూటీ చేసేవి. ఇప్పుడు గుప్పెడు గింజలు విసిరి ఆనందపడుతున్నాము. కాకి బావకి ఒంటి కన్ను ఉన్న మనం కన్నుమూస్తే నిత్యం కాకి బావ తోటే పని. ఆ గుప్పెడు ముద్ద నోట కరుచుకుని పట్టుకెళ్ళిపోతే పరమానందం. లేదంటే ఏదో తప్పు జరిగిందని భావన.

ఆకాశంలో ఎగిరే కొంగల గుంపు, నీటిలో తిరిగాడే బాతులు ఇవన్నీ మన వాకిట్లో కి రావు కానీ వాటిని చూసినప్పుడల్లా ఆనందమే కలుగుతుంది. ప్రకృతి ప్రేమికులకి. ఎక్కడి నుంచి చూస్తుందో తెలీదు నేల మీద ఉన్న ఆహారాన్ని గబుక్కున వచ్చి తన్నుకు పోతుంది గ్రద్ద. అంత శక్తివంతమైనది. 

ఆధునిక కాలంలో రోజురోజుకీ కరిగిపోతున్న అడవులు పెరిగిపోతున్న సాంకేతిక విజ్ఞానం పక్షి జాతి వినాశనానికి దారి తీస్తున్నాయి. మా తరం అంతా వాడితోటి ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగాము. ఇప్పుడు ఈ నవతరానికి పక్షులను చెట్ల మీద కాకుండా బొమ్మల పుస్తకాలలో చూపించి ఆనందపరుస్తున్నాము. మళ్లీ కాలం తిరగబడి సాయం సంధ్య వేళ పక్షులన్నీ ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరిగి గూటికి చేరే రోజులు వస్తాయని ఆశిద్దాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట