దేవుడు

 దేవుడు


కాసులు ఉన్నవాడికి 

లేనివాడికి ఆ దేవుడే దిక్కు 


ముక్తి కోసం వచ్చే భక్తులకి 


గుడి లోపల దేవుడు వరాలు ఇస్తాడు. 


భుక్తి కోసం పడిగాపులు కాచే అన్నార్తులకి 


భక్తుల చేత వరహాలిప్పిస్తాడు దేవుడు


గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు 


గుడిలోకి అడుగుపెట్టడు 


ఎందుకని 


గుడిలో నుంచి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 


దేవుడికి ప్రతిరూపాలని నమ్ముతాడు కాబట్టి.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట