పోస్ట్‌లు

ఆ నాలుగు చుక్కలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ నాలుగు చుక్కలు

ఇంకా కాంతమ్మ రాలేదు ఏమిటి ? రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చేసేదే! ఏమైంది అబ్బా అనుకుంటూ మాటిమాటికీ వీధిలోకి తొంగి చూస్తున్న సుజాతకి వాడిపోయిన మొహంతో దూరం నుంచి వస్తున్న కాంతమ్మ కనబడింది.  సుజాతను చూస్తూనే రాత్రి మా చంటోడు నిద్రపోలేదు తెల్లవార్లు పీకుతూనే ఉన్నాడు. నా దగ్గర పాలు లేవని తెలుసు. పోత పాలు పడుతుంటే విరోచనాలు అవుతున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ.  భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతమ్మ కొడుకు కంట సుజాత కొడుకు రెండు నెలల పెద్ద. సుజాత కొడుకు రెండు గుక్కలు తాగి పక్కకు తిరిగి పడుకుంటాడు. ఒకపక్క అతివృష్టి మరొకపక్క అనావృష్టి. ఇద్దరినీ సృష్టించింది దేవుడే. అయినా ఎవరి అదృష్టం వారిది. విజ్ఞాన శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందిన తల్లిపాలు మించిన బిడ్డకి ఏ ఆహారము లేదంటారు డాక్టర్లు. తల్లిదగ్గర పాలు లేక కొన్ని కుటుంబాలు బాధపడుతుంటే ఉన్న పాలు బిడ్డకు పంచి ఇవ్వడానికి అందం చెడిపోతుందని ఉద్దేశంతో కొంతమంది కావాలని పోత పాలు అలవాటు చేస్తున్నారు కొంతమంది తల్లులు. కాంతమ్మ మాటలు వినేసరికి ఒక బిడ్డకు తల్లిగా సుజాత హృదయం చలించిపోయింది. ఆ చిన్ని బొజ్జ కి తల్లి ఇచ్చే నాలుగు చుక...