పోస్ట్‌లు

ఎద్దులు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జోడెద్దులు

జోడెద్దులు. ఉదయం 5:00 గంటలు అయింది.  హేమంత రుతువు ప్రతాపానికి తట్టుకోలేక దుప్పటి ముసుగు వేసి పడుకోవాలని అనిపించిన ఆ పల్లె బాధ్యతలు గుర్తు చేస్తూ గంప కింద కోడి ఆకాశంలోని పక్షులు పాకలోని పశువులు అరుపులతో తన బాధ్యత గుర్తుకొచ్చింది రామయ్యకి.  తూర్పు వైపు కాస్త వెలుగు కనిపిస్తే చాలు ఆ పాకలోని పశువులు అంబా అంబా అని అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపుల సంకేతం యజమాని రామయ్యకు ఒక్కడికే తెలుసు. గబగబా దంత ధావనం కానిచ్చి వాటి ఆకలి తీర్చి ఆ జోడు ఎడ్లను బండి దగ్గరికి తీసుకువెళ్లి కాడి భుజం మీద వేసి వాటిని తమ బాధ్యతలకు సిద్ధం చేశాడు. రామయ్య కూడా బండి ఎక్కి యజమానిగా వాటికి దిశా నిర్దేశం చేసి సత్తు గిన్నెల క్యారేజీ పట్టుకుని సుబ్బి రెడ్డి గారి పొలం వైపు పరుగులు తీయించాడు.  ఆ ఊర్లో సుబ్బిరెడ్డి గారు వంద ఎకరాల భూమికి యజమాని. రామయ్య మాత్రం ఆ జోడి ఎడ్ల బండికి యజమాని. ఆ బండి తోలడం తప్ప వేరే ఏ పని చేతకాదు. ఆధునిక కాలంలో యాంత్రికరణ పెరిగి జోడు ఎడ్ల బండికి గిరాకీ తగ్గిపోయినా రామయ్య ఎడ్ల బండికి మటుకు గిరాకీ తగ్గలేదు. చిన్న చిన్న పొలం పనులకి ట్రాక్టర్ తొట్లు ఉపయోగించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని....