పోస్ట్‌లు

అమ్మ మారిపోయింది లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ మారిపోయింది

అమ్మ మారిపోయింది రాత్రి 9:00 అయింది  డిసెంబర్ నెల కావడం వల్ల చలి వణికించేస్తోంది. టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి. హలో అనగానే" అమ్మ ఎలా ఉన్నావ్ అని కొడుకు రంగనాథ్ అడుగుతూ నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను సంక్రాంతి పండక్కి.. నెలరోజుల పాటు అక్కడే ఉంటాను. పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు. ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి స్వీట్లు పట్టుకెళ్తాను అంటూ తన కావాల్సిన లిస్ట్ అంత చిన్నపిల్లల్లో చెప్పడం ప్రారంభించాడు. నాన్న ఎలా ఉన్నారు ?ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి.?పిల్లలు రావటం లేదు. మీ కోడలు కూడా రావట్లేదు. నేనొక్కడినే వస్తున్నా అంటూ కొడుకు చెప్పిన మాటలకి సరేరా జాగ్రత్తగా బయలుదేరిరా అంటూ పిల్లల గురించి కోడలు గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజలక్ష్మి. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సొంత ఊరు కొచ్చి నెలరోజుల పాటు పిల్లలతో భార్యతో ఉంటాడు. అలా ప్రతిఏటా వచ్చినప్పుడల్లా తన కావలసిన పచ్చళ్ళు స్వీట్లు, పొడులు ఆవకాయలు అన్ని తయారు చేయించుకుని పట్టుకెళ్తుంటాడు. పిల్లలకిష్టమని తన భ...