దేవుడి సొమ్ము
దేవుడి సొమ్ము " రామా రెడ్డిగారు . మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట! . ఏ ఏడాది శిస్తు పూర్తిగా ఇవ్వరు. ఇలాగైతే ఎలాగండి! అంటూ కోపంగా అరిచాడు వినాయకుడి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు. ఆ మాటలకు రామా రెడ్డి నవ్వుతూ పంటలు పండక పోతే ఏం చేయమంటారండి ! మేము మటుకు దేవుడు సొమ్ము ఉంచుకుంటామా! మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి అన్నాడు. సదరు రెడ్డి గారికీ ప్రతి ఏటా ఇదే మాట చెప్పడo అలవాటైపోయింది. రెడ్డి గారి మాటలకి " ప్రతి ఏటా ఒక కారు మారుస్తున్నాడు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. కానీ దేవుడు సొమ్ములు కట్టడానికి మటుకు పంటలు పండలేదు అంటున్నాడు అని మనసులో బాధపడ్డాడు హనుమంతరావు. ఆ గ్రామంలో వినాయకుడు దేవాలయం అది పురాతన మైనది స్వయంభు ఆలయం. రోజు వందలాది భక్తులు వచ్చి కోరిన కోర్కెలు తీర్చుకోడానికి మొక్కులు మొక్కుతుంటారు. ప్రతిరోజు అక్కడ గణపతి హోమం , నిత్య పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలంలో ఎవరో భక్తులంతా కలిపి దానంగా 25 ఎకరాలు దేవుడికి ఇచ్చారు. ఆ భూమి అంతా ఆ ఊర్లో పలుకుబడి ఉన్న రెడ్డి గారు కౌలు...