ఎవరుంటారు ఇలాగా!
ఎవరుంటారు ఇలాగా! సరోజ గారు ఎవరండీ మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటికి వచ్చిన నర్సు గట్టిగా పిలిచింది. నేనేనండి ఒక సుమారు 30 సంవత్సరముల వయస్సు గల యువతి చేతిలో ఒక ఫైల్ తో డాక్టర్ గారు గదిలోకి అడుగు పెట్టింది. అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లను చాలా మంచి హృదయంతో గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పేషంట్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది. పైగా నార్మల్ డెలివరీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే హాస్పటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. పురుడు అంటే పునర్జన్మంటారు. ఆడపిల్ల నెలతప్పిన రోజు దగ్గరనుంచి ఈ రోజుల్లో ప్రతి నెల డాక్టర్ చెకప్ కి తిరగడం స్కానింగ్లు తిరగడం తప్పనిసరి. రోజులు అలా ఉన్నాయి నమస్తే మేడం అంటూ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు. నా పేరు సరోజ మాది పక్క ఊరు మా ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. డాక్టర్ గ...