పోస్ట్‌లు

ఏప్రిల్ 29, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రశ్నలు

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన దత్తాత్రేయ స్వామి* 1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జ: చాలా మంది కత్తి అని చెప్పారు. గురువు: కాదు, మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. 2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ? జ: చాలా మంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలూ గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము. 3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? జ: చాలా మంది పర్వతం, సూర్యుడు, భూమి ఇలా ఎన్నో అంటారు. గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే. 4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది? జ: చాలామంది, వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్పారు. గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం". మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. 5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది? జ: దూది, గాలి, ఆకులు అని చెప్పారు. గురువు: ప్రపంచంలో తేలికైనది అ...

భార్య అంటే

భార్య అంటే భార్య అనేది కేవలం ఒక బంధం కాదు… ఒక ప్రపంచం. ఆమె తన ప్రేమను మాటల్లో కంటే పనుల్లో చూపిస్తుంది. తన ఆనందాన్ని భర్త, పిల్లల చిరునవ్వులో చూస్తుంది. మనం ఇంట్లోకి అడుగుపెడుతూనే అనుభవించే ప్రశాంతత వెనుక ఆమె కష్టమే ఉంటుంది. ఆమె కాఫీలో చక్కెర తక్కువైందా ఎక్కువైందా అన్నది గుర్తుండదు, కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకుని చూసుకుంటుంది. పుట్టినరోజు మరిచిపోతే ఒప్పించలేం, కానీ మన ఒత్తిడిని మాత్రం మాటల్లో చెప్పకుండానే గ్రహిస్తుంది. ఆమె జీవితం అద్దం లాంటిది. మనం ఎలా ఉన్నామో ప్రతిబింబించగలదు. మన భవిష్యత్తుకు బలం ఇచ్చే తోడు . ఒక భార్య అంటే... తల్లి లా కాపాడే మనసు, స్నేహితురాలిగా హాస్యం పంచే మాటలు, గురువుగా మార్గదర్శనం చేసే జ్ఞానం, ప్రేమికురాలిగా మన హృదయాన్ని తాకే సానుభూతి. పెళ్లికి ముందు మనం స్వేచ్ఛగా జీవించాం. పెళ్లి తర్వాత మన బాధ్యతలతో జీవించాం. కానీ ఆ బాధ్యతల్లోనూ భార్య చేతిని అందించినప్పుడు జీవితం తేలికగానే గడిచిపోతుంది. ఎందరో భార్యల కృషిని గుర్తించకుండా మౌనంగా తీసుకుంటున్న సమాజానికి... ఈ మాట చెబితే సరిపోతుంది – "ఆమె లేకుండా ‘ఇల్లు’ అనేది ఒక గది మాత్రమే." ఆమె జీవితంలో స...

గురువులు

చిత్రం
దత్తాత్రేయుడు అంటే హిందూ ధర్మంలో ఒక మహత్తరమైన దేవతా స్వరూపం. ఆయన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల సమ్మిళిత స్వరూపంగా భావించబడతారు. ఆయనను త్రిమూర్తుల అవతారంగా పూజిస్తారు. మహా పతివ్రత అయిన అత్రి మహాముని భార్య అనసూయని పరీక్షించబోయి త్రిమూర్తులు  అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లి  అనసూయ దేవిని వివస్త్రగా మరి తమకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుతారు. మహా ప్రతివ్రత అయిన అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురుని పసిబిడ్డలుగా మార్చి వారికి పాలిచ్చి ఆతిథ్యం ఇస్తుంది. దీనితో వారు ముగ్గురు సంతోషించి అనసూయ దేవికి త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుని బిడ్డగా ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. దత్త అంటే ఇచ్చినవాడు. ఆత్రేయ అంటే అత్రి మహాముని కుమారుడు  అని అర్థం   దత్తాత్రేయుడు త్రిముఖ రూపంలో, మూడు తలలతో, నాలుగు చేతులతో చూపిస్తారు. ఆయన పక్కన ఒక కుక్క (ధర్మానికి సూచిక) మరియు వెనక గోవు (ధర్మప్రతీక) ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి విద్య నేర్చుకోవడానికి ఏదో ఒక గురువుని ఆశ్రయిస్తారు.ఈ మహానుభావుడు  తన చుట్టూ ఉండే ప్రకృతిలోని వస్తువులు జంతువులు తనకి గురువు అంటాడు దత్తాత్రేయుడు. అలా ఇరవై నాలుగు గురువుల దగ్...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి? పరిచయం 21వ శతాబ్దపు సాంకేతిక ప్రపంచంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (AI) అనేది మార్గదర్శక శక్తిగా నిలుస్తోంది. ఇది మానవ మేధస్సును అనుకరించే కంప్యూటర్లను, యంత్రాలను అభివృద్ధి చేసే శాస్త్రం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది: • కంప్యూటర్లు మానవుల మాదిరిగా ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే విధంగా అభివృద్ధి చేయడం. • అనుభవాల నుంచి నేర్చుకొని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. AI పనిచేసే విధానం • మెషిన్ లెర్నింగ్ (Machine Learning): డేటా ఆధారంగా స్వయంగా నేర్చుకోవడం. • న్యూరల్ నెట్‌వర్క్స్ (Neural Networks): మానవ మెదడును అనుకరించే లాజికల్ మోడల్స్ రూపకల్పన. • డీప్ లెర్నింగ్ (Deep Learning): క్లిష్టమైన డేటాను లోతుగా విశ్లేషించడం. • నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP): మానవ భాషను యంత్రాలు అర్థం చేసుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉపయోగాలు 1. వైద్య రంగంలో • రోగ నిర్ధారణను త్వరగా మరియు ఖచ్చితంగా చేయడం. • వ్యక్తిగత వైద్య చికిత్సల మార్గదర్శనం. 2. వాణిజ్య రంగంలో ...

జై జవాన్

జై జవాన్. ఉద్యోగం పురుషలక్షణం అంటారు. కొన్ని ఉద్యోగాలు అందమైన కార్యాలయాల్లో చల్లని రాతి గదులలో కూర్చుని బుద్ధి బలంతో చేసేవి. మరికొన్ని శారీరిక శ్రమతో చేసేవి. మరికొన్ని కొలువులకి దేశ సరిహద్దులే కార్యాలయాలు . కొండ కోనల్లో ఎండ వానల్లో మంచు తుఫానులో ఇరవై నాలుగు గంటలు దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం.  ఆ విధంగా పనిచేసే వారికి జీతభత్యాలు ఇచ్చినప్పటికీ వారిని ఎప్పటికీ మనం త్యాగమూర్తులుగానే గుర్తించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరిది దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం. ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడు దేశ రక్షణ చేస్తూ ఉండాలి. కన్నతల్లిని ఉన్న ఊరుని మరిచిపోయి దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం గా పనిచేసే ఈ సైనికులు నిజంగా చిరస్మరణీయులు. దేశ ప్రజల ఆకలి తీరాలంటే రైతు పంట పండించాలి. దేశ పౌరుడు నిశ్చింతగా నిర్భయంగా తిరగాలంటే సైనికుడు తుపాకీ గురి పెట్టుకుని ఉండాలి ఎప్పుడు. దేశంలో అనేక రకాల ఉపాధిలు ఉన్నప్పటికీ అందుకే ఈ వృత్తులకి అంత గౌరవం. జై జవాన్ జై కిసాన్ అంటారు. దేశ రక్షణే కాకుండా ప్రకృతి విపత్తులు లో ఆదుకునే పరమాత్ముడు సైనికుడు.యుద్ధమంటే ఎప్పుడు ముందుకు దూసుకు పోయేది సైనికులు.ఆర్మీ అంటే అన్నదమ్ముల్లా ఆదుకునేది.అంద...