ప్రశ్నలు
*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన దత్తాత్రేయ స్వామి*
1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు, మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.
3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం, సూర్యుడు, భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.
4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది?
జ: చాలామంది, వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం".
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది, గాలి, ఆకులు అని చెప్పారు.
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు, బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.
7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది?
జ:తినడం, పడుకోవడం, తాగడం, తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి