మామిడి తోట
మామిడి తోట వేసవికాలం సాయంకాలం నాలుగు గంటలు అయింది. అయినా ఇంకా ఎండ ప్రతాపం తగ్గలేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతంఅయింది. ఈదురు గాలులు." గాలి దుమ్ము వచ్చేలా ఉంది పిల్లలు అందరూ తోటలోకి వెళ్దాం పదండి తట్టలు పట్టుకుని రండి ఉన్న కాయలు రాలిపోతాయి కాబోలు అని చలపతిరావు గారు తోటలోకి పరిగెత్తారు పిల్లలతో సహా. బలంగా వీస్తున్న గాలులకి కొమ్మలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి.అప్పటికే తోటలో కాయలు కొద్దికొద్దిగా గాలికి కింద పడిపోయిఉన్నాయి. పిల్లలందరూ మామిడికాయలు ఏరి ఆ తట్టలో పడేసారు. అలా తట్టతో తీసుకొచ్చిన కాయలు ముక్కలుగా మారి కుండలో మరునాడు మాగాయిగా మారిపోయేది .అది చిన్ననాటి మామిడి తోట అనుభవం. ఆ మామిడి తోటకు సుమారు అప్పటికి 60 సంవత్సరాల సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు అన్నదమ్ములు అందరూ కలిసి నాటిన మొక్కలు. వాళ్లు బ్రతికున్న రోజుల్లో వాటి ఫలాలు తిన్నారా లేదో తెలియదు గాని అంటే మనవలం శుభ్రంగా ఆనందంగా ఆ మామిడి తోట లో కాసిన మధుర ఫలాలు అన్ని శుభ్రంగా తిన్న వాళ్ళమే. ఆ తోట చూసినప్పుడల్లా నాకు రాజుగారు ముసలివాడు కథ గుర్తుకొస్తుంది. ఆ తరం వాళ్లకి ఎంత ముందుచూపు. అంత పెద్ద తోటను పెంచడానికి వాళ్ళు ఎంత క...