పోస్ట్‌లు

ఆసు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆసుపత్రి

ఆసుపత్రి  ఆపదలో ఆతిథ్యం ఇచ్చి ఆరోగ్యం పెంచి ఆనందం పంచి ఆదుకునే ఆరోగ్య ఆలయం. అపర ధన్వంతరి నిలయం గుడిలో ఉండేది దేవుడు అమ్మ ఒడిలోని దేవుడు పసిపాప  బడిలోని దేవుడు గురువు నడిచే దేవుడు ఉండేది ఈ ఆలయం. ఆ గుడిలోని మూల విరాట్ కు గుండె నిండా భక్తి నింపుకొని పూజా పునస్కారం. ఈ గుడిలోని దేవుళ్ళు కలకాలం కాపురం ఉండేది రోగి గుండెలో. గుండెలో చోటు ఇచ్చేది కొంతమందికే. ప్రాణానికి ప్రాణమైతే తప్ప గుండె చోటు ఇవ్వదు. నొప్పి వచ్చి నోరు తెరిచి అడిగితే సూ ది మందు ఇచ్చి సేద తీర్చి అందమైన పానుపు ఇచ్చి ఆశ్రయం ఇచ్చే ఆలయం పాన్పు మీదకి కొత్తగా చేరి అందమైన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఒక సంకేతం. పాన్పు వీడి పరలోకానికి ఎరిగినట్లుగా మరొక వైపు నుండి కన్నీళ్ళ ప్రవాహం. నిత్యం జనన మరణాల రణరంగం. ఇవేవీ పట్టనట్లు కర్మయోగిలా నిలబడు తుంది ఆ చికిత్సలాయం. నిత్యం ఇక్కడ కత్తులతో యుద్ధమే జయాపజయాలు ఆయుర్దాయమనే  ముసుగులో నిత్యం దోబూచులాడతాయి. అయినా ఆఖరికి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అపర ధన్వంతరీ నిలయం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279