బుల్లెట్ బండి
మనిషి నిత్య జీవితంలో అలసిన సొలసిన మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి మళ్లీ కొత్త ఉత్తేజం రావడానికి కి ఏదో వ్యాపకం అంటూ ఉండాలి. కొంతమంది పూజలు చేయడం మరికొంతమంది టీవీ చూడడం మరికొంతమంది పాటలు వినడం మరికొంతమంది కవిత్వం రాయడం వినడం తన వ్యాపకంగా ఎంచుకుంటారు. అయితే సంగీతం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. రాగ పరిజ్ఞానం లేకపోయినా మన మనసుకి సంగీతం హాయినిస్తుంది. రాగాలు తో రోగాలు కూడా నయం చేయవచ్చని ఎం తో మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అలాగే ఈ రోజుల్లో మంచి సినిమా పాటలు ప్రైవేట్ సాంగ్స్ కూడా జనాభిమానం చూరగొన్నాయి.దేనికైనా మనసే కదా ప్రధానం. మనసు సరిగా లేకపోతే ఆలోచనలు పెరుగుతాయి.ఆలోచనలు పెరిగితే రక్తప్రసరణ పెరుగుతుంది రక్త ప్రసరణ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన మానసిక ఆనందానికిఈ రోజుల్లో బయట షికార్లకి సినిమాల తిరగ లేకపోయినా యూట్యూబ్ వారి పుణ్యమా అని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ని మనకి ఒక క్లిక్కుతో చూపిస్తున్నారు. మాటల్ని అందంగా లయబద్ధంగా తాళ బద్ధంగా అమర్చడాన్ని పాట అంటారు. పాటలో పల్లవి చరణం రెండు భాగాలు. జానపద పాటలు సినిమా పాటలు రాముల వారి పాటలు చెక్కభజన పాటలు విష...