బుల్లెట్ బండి
మనిషి నిత్య జీవితంలో అలసిన సొలసిన మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి మళ్లీ కొత్త ఉత్తేజం రావడానికి కి ఏదో వ్యాపకం అంటూ ఉండాలి. కొంతమంది పూజలు చేయడం మరికొంతమంది టీవీ చూడడం మరికొంతమంది పాటలు వినడం మరికొంతమంది కవిత్వం రాయడం వినడం తన వ్యాపకంగా ఎంచుకుంటారు. అయితే సంగీతం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. రాగ పరిజ్ఞానం లేకపోయినా మన మనసుకి సంగీతం హాయినిస్తుంది. రాగాలు తో రోగాలు కూడా నయం చేయవచ్చని ఎం తో మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అలాగే ఈ రోజుల్లో మంచి సినిమా పాటలు ప్రైవేట్ సాంగ్స్ కూడా జనాభిమానం చూరగొన్నాయి.దేనికైనా మనసే కదా ప్రధానం. మనసు సరిగా లేకపోతే ఆలోచనలు పెరుగుతాయి.ఆలోచనలు పెరిగితే రక్తప్రసరణ పెరుగుతుంది రక్త ప్రసరణ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన మానసిక ఆనందానికిఈ రోజుల్లో బయట షికార్లకి సినిమాల తిరగ లేకపోయినా యూట్యూబ్ వారి పుణ్యమా అని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ని మనకి ఒక క్లిక్కుతో చూపిస్తున్నారు.
మాటల్ని అందంగా లయబద్ధంగా తాళ బద్ధంగా అమర్చడాన్ని పాట అంటారు. పాటలో పల్లవి చరణం రెండు భాగాలు. జానపద పాటలు సినిమా పాటలు రాముల వారి పాటలు చెక్కభజన పాటలు విషాద గీతాలు ప్రేమ గీతాలు చందమామ పాటలు లాలి పాటలు జోల పాటలు ఒకటేమిటి ప్రతి విషయం మీద అలనాటి కవుల నుండిఈ నాటి సినిమా కవుల వరకు తనకు నచ్చిన సబ్జెక్టులో మన మనసుకు నచ్చిన పాటలు రాస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో నేను విన్న ఒక పాట నా మనసు కదిలించిన పాట మీకు తెలియజేస్తున్నాను.
నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా Ba అంటూ పల్లవి తో మొదలైన పాట నా హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాట ఏ సినిమాలోది ఎవరు రాశారో తెలియదు గాని తెలంగాణ జానపద పాట అని వినికిడి ,నేను కరెక్టో కాదో తెలియదు. ఈ పాటను ఒక పెండ్లి కూతురు పెండ్లి కొడుక్కి తన పెరిగిన విధానం తన గొప్పదనం గురించి తెలియజెప్పే పాట.
. కవి ఎంతో అనుభవించి ఈ పాటని రాసినట్లుగా తెలుస్తోంది. పదాలు కూడా నిత్యం మనకి వాడుకభాషలో ఉన్నవే, మొదటి రెండు చరణాలు తన పెండ్లి కూతురు అలంకరణ గురించి ఆ పెండ్లి కొడుకుకి వివరంగా చెబుతోంది. కవి ఇంత విపులంగా రాశారు అంటే అతనికి ఎంత విషయ పరిశీలన ఉందో అర్థమవుతోంది.
పెళ్లికూతురు ముస్తాబు లో ఉన్న నేను నీతో అడుగులు వేసి మీ ఇంటికి వస్తాను అని నీకు అందమైన ప్రపంచాన్ని చూపిస్తానని పెళ్లికూతురు తన గొప్పదనాన్ని పెళ్ళికొడుకుకి ఎంత అందంగా చెప్పింది. అసలు కవికి ఈ రకమైన ఆలోచన వచ్చినందుకు కు ఆయనకి సరస్వతీ కటాక్షం ఎంతగా ఉందో అర్థమవుతుంది. కవి చెరువు కట్ట దగ్గర పెరిగిన చామంతినీ వాగు దగ్గర పెరిగిన మల్లెపూలునీ పెళ్లి కూతురు జడగా అలంకరించాడు . నిజమే ఆధునిక కాలంలో వేలకు వేలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి కూతురు జడలు కుట్టిస్తున్నారు కానీ ఆ రోజుల్లో పల్లెటూర్లో దొరికిన ప్రతి పువ్వు కి జడలో స్థానం ఉండేది.
అయితే పాటలో ఈ చరణం సహజత్వానికి దగ్గరగా ఉంది. అవ్వ చాటు ఆడపిల్లని అయ్యా అంటూ చెప్పిన విధా నాన్ని బట్టి ఈ ఆడపిల్ల తను క్రమశిక్షణగా పెరిగిన ఆడపిల్ల అని చెప్పకనే చెప్పింది. అవ్వ చాటు ఆడపిల్ల అంటే అద్భుతమైన అర్థం ఉంది. నాన్న ప్రేమ, అన్నదమ్ముల అనుబంధం తో పెరిగానని వాళ్ళ కుటుంబంలో తనొక్కతే ఆడపిల్లని చెబుతుంది. అంటే తను వాళ్ళందరూ గారాబంగా చూసుకున్నారని నువ్వు కూడా మీ ఇంటికి వచ్చిన తర్వాత అలాగే చూడాలని పెళ్లి కూతురి కోరిక. కవి ఈ పాటను బుల్లెట్ శబ్దం తో అలంకరించాడు.
ఇక తదుపరి చరణాల్లో పెళ్లయిన తర్వాత కుడి కాలు పెట్టి మీ ఇంటికి వచ్చి పొద్దున్నే లేచి చుక్కల ముగ్గు పెట్టి నిన్ను చుక్కలా చూసుకుని మురిసిపోతాను అని తన రాకతో అతని జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని పెండ్లి కూతురు పెండ్లి కుమారుడు తోటి చెబుతుంది. పెండ్లి కూతురు తన భాషలో తన గురించి పెళ్లి కొడుకు చెప్పడం ఎంత బాగుంది. పెళ్లి కూతుర్ని ఒక కవితా వస్తువుగా ఎన్నుకోవడం ఎంత అందంగా ఉంది సాహిత్యాన్ని బట్టి పాట వినాలి పిస్తోంది. ఆడపిల్ల ని ప్రమోట్ చేయడం కూడా ఎంత గొప్ప వి కీషయం.
ఈ పాట కి సంగీతం సమకూర్చినది ఎవరో తెలియదు గానీ అతనికి స్వరాలు మీద పట్టుబాగా ఉంది . సాహిత్యానికి తగిన సంగీతం సమకూర్చారు . వాడిన వాయిద్య పరికరాలు కూడా పాటకి మరింత శోభను చేకూర్చాయి.ప్రజలు మంచి సంగీతాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు అది జానపదం కావచ్చు సినిమా పాట కావచ్చు చక్క భజన పాట కావచ్చు. ఈ పాట శ్రీమతి మోహన భోగరాజు గొంతులో అతి శ్రావ్యంగా సాగింది. ఈటీవీ వారి ప్రత్యేక షో లో ఆమె అభినయం కూడా ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చింది. ఈ పాటని మా ఇంట్లో పండు ముదుసలి దగ్గర నుంచి పసిపాప వరకు అందరూ పదేపదే విని ఆనందించాం. ఈ పాటని ని ప్రపంచానికి అందించిన నిర్మాత, కవి, స్వరాల రాజు, పాట పాడిన మోహన నిజంగా అభినందనీయుlu.
రచన. : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
సామర్లకోట.
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి