అమ్మ కాదు డాక్టరు బొమ్మ

అమ్మ కాదు డాక్టర్ బొమ్మ

 ప్రతి స్త్రీకి మాతృత్వం ఒక తీయని వరం. దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఆ వరం ఇచ్చాడు. పశుపక్షాదులలో కూడా జంతువులలో కూడా బిడ్డను కనే అధికారం ఒక్క ఆడజన్మకు మాత్రమే ఉంది. కారణం ప్రకృతి ధర్మం మరియు స్త్రీ సహనమూర్తి. బిడ్డ కడుపులో పడింది దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి నవ మాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి చావుకు దగ్గరగా వెళ్లి ఒక పసి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ భూమి మీద పడిన దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి తన రక్తాన్నే చనుబాలుగా మార్చి బాలారిష్టాలు దాటించి విద్యాబుద్ధులు చెప్పించి ఒక భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. ఈ విషయంలో తల్లి పాత్ర అమోఘం. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వలన పుట్టే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.బిడ్డ మానసిక ఆరోగ్యం ,శారీరక ఆరోగ్యం తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కీలకం. 

 పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంటిలో అనుభవజ్ఞులైన తాతమ్మలు నానమ్మలు ఉండేవారు. ఒక స్త్రీ గర్భవతి అయిన దగ్గర నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెట్టవలసిన ఆహారము గురించి పదేపదే ఆ పెద్దవాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అయితే కాలం మారింది.

 ఎవరికి వాళ్లు చదువుకుని ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్లి విడిగా కాపురాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆడపిల్లలు అందరూ కూడా విద్యావంతులే. అయితే స్త్రీకి సలహాలు ఇచ్చేది ఎవరు. 

డాక్టర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడే కొంతవరకు సందేహం నివృత్తి చేసుకోగలదు. తన తల్లి దగ్గర నుండి కూడా కొంతవరకు సలహాలు తీసుకోగలరు. అమ్మ కూడా తన అనుభవాలను పంచుకోగలదే కానీ విజ్ఞానం పంచలేదు. ఇటువంటి సందర్భంలో ప్రతి యువతి విషయపరిజ్ఞానం కోసం ఇంటర్నెట్ల మీద ఆధారపడుతోంది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఐఐటి పట్టా పుచ్చుకున్న యువకుడు వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన తన స్నేహితులతో కలిసి ఒక యాప్ ను తయారు చేయడం జరిగింది. దాని పేరే IMUMZ. ఇది ప్రత్యేకంగా గర్భవతులైన స్త్రీలు గురించి తయారు చేసిన
విజ్ఞాన గని.

ప్రతి స్త్రీ గర్భవతి అయిన దగ్గర్నుంచి శారీరక మానసిక మార్పులు చాలా వస్తాయి. దానికి తగినట్లుగా ఆమె తీసుకోవాల్సిన ఆహారం, ఒత్తిడి తగ్గించే మార్గాలు ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కృషి వెనక అనుభవజ్ఞులైన డాక్టర్ల కూడా ఉన్నారు. శాస్త్ర సమ్మతమైన విజ్ఞానం మాత్రమే ఈ యాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గర్భవతి అయిన స్త్రీ తనకు తానే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. 
తనకు తానే తన సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లను తక్షణమే సంప్రదించవచ్చు. 

గర్భిణీ స్త్రీ కి వచ్చేకొన్ని సమస్యలు ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ సమస్యకు పరిష్కారం అయ్యేది కాదు. ఇప్పుడు ఇటువంటి యాప్ ల ద్వారా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం తనకు తానే తీసుకోవచ్చు.

   ఈ యాప్ కు పెట్టిన పేరు విచిత్రంగా ఉండి అర్థం తెలియకపోయినా అసలు దీని గురించి తెలుసుకోవాలని కుతూహలం తో ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసినప్పుడు నాకు కొన్ని మంచి విషయాలు కనబడ్డాయి. ప్రతి స్త్రీ గర్భిణీ సమయంలో భర్త పాత్ర గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. అవి ఒకటి గర్భిణీ అయిన భార్యని క్రమం తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం ఒకటే కాదు ఆ స్త్రీని మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంచితే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద చాలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది నిజమే. ఈ కాలంలో మగ పిల్లలు గర్భవతి అయిన భార్య గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది నేను విని చెప్పినది కాదు. నేను చూసి చెప్పిన విషయం. అంతే కాకుండా భర్తకు ఉన్న దురలవాట్లు బిడ్డను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలియ చెప్పడం జరిగింది. 

  ఈ యాప్ ప్రారంభించిన కొద్దికాలంలోనే ప్రజాధరణ ఒక్కోపొంది వేల సంఖ్యలో అభిమానులను అక్కున చేర్చుకుంది. లక్షల్లో వచ్చే జీతాలను వదులుకొని ఇటువంటి సమాజానికి ఉపయోగపడే యాప్ ను రూపొందించిన ఈ యువకులను అభినందించకుండా ఉండలేం. 

అయితే ప్రతి పల్లెల్లోనూ కూడా సెల్ఫోన్లు వాడకం ఇంటర్నెట్ వాడకం కూడా పెరిగింది. అయితే ఆంగ్ల భాష అందరికీ అర్థం కాకపోవచ్చు. అయితే తెలుగులో కూడా ఈ విజ్ఞానం పంచితే చాలా బాగుంటుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట