కోనసీమ జిల్లా విహారయాత్ర
ఆంధ్రప్రదేశ్ 2022 సంవత్సరంలో జిల్లా పునర్విభజన చట్టం ప్రకారం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలుగా ఉండే ప్రాంతమంతా మూడు జిల్లాలు అయింది. ఈ జిల్లాలో పచ్చటి పంట పొలాలతో, పిల్ల కాలువలతో, అందమైన గోదావరి నది తీరాలతో, కొబ్బరి తోటలతో అరటి తోటలతో పూల తోటలతో చాలా ఆహ్లాదకరంగా చూడడానికి ఆనందంగా ఉంటుంది. కడియం : తూర్పుగోదావరి జిల్లాలో కడియం గ్రామంలో పూల తోటలు చూడదగినవి. ఇక్కడనుండి ప్రతిరోజు పూలని దేశంలోని వివిధ ప్రాంతాలకి విమానాల ద్వారా ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ అనేక నర్సరీలు దేశంలోని వివిధ ప్రాంతాలకి మొక్కలను సప్లై చేస్తూ ఉంటాయి. అంతర్వేది: ఇక్కడ అతి ప్రాచీనమైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. సముద్ర ప్రాంతంలో అన్నా చెల్లెళ్ల గట్టు అనే ప్రదేశం చూడదగింది. అప్పనపల్లి : బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం. అయినవిల్లి: అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి కొలువై ఉన్నాడు ఇక్కడికి దగ్గరలో ఉన్న ముక్తేశ్వరం అనే గ్రామంలో క్షణముక్తేశ్వరుడు ఆలయం చూడదగినది...