శాస్త్రి గారి పాట
శాస్త్రి గారి పాట తెలుగు పదాల మూట. అనకాపల్లి ఒకప్పటి విశాఖ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తీయటి బెల్లం. బంగారపు రంగులో మెరిసిపోయే బెల్లపు అచ్చులు కానీ . బెల్లపు వ్యాపారానికి ప్రసిద్ధ స్థలం. బెల్లపు పానకం లాంటి తెలుగు పదాలతో సినీ కళామతల్లిని ఆరాధించే పాటల బ్రహ్మ అక్కడ పుడతాడని ఎవరికి తెలుసు. అంతా విధాత తలపు. మెడలో శ తస్కోప్ వేసుకుని మన రోగాలను నయం చేస్తాడు అనుకుంటే పాటలతో ధైర్యాన్ని ఇచ్చి పదాలతో మెదడుకు పదును పెట్టి మన ఆరోగ్యాలను బాగుచేసే పాటలకు జన్మనిచ్చాడు మన సీతారామశాస్త్రి. ఏది మన చేతుల్లో ఉండదు కాలం చేసే మార్పులకి మనం తలవగ్గి నడవ వలసిందే. కాలానికి నాయకుడు ఈశ్వరుడు. కళలకు అధిపతి కూడా ఆ నటరాజే. ఆయన అందుకునే మార్గం మళ్లించి తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా విశ్వనాథుడి దరి చేర్చాడు . ఈయన సీతారాముడు. ఆయన విశ్వనాధుడు. ఇంకేముంది సీతారాముడి కలo నుంచి పుట్టిన పాట తెలుగుజాతి కీర్తి కిరీటాలను ఎక్కడకో తీసుకుని పోయేలా చేసింది. ఒకపక్క పాట మరొక పక్క విశ్వనాథుడు దర్శకత్వం ఇంకేముంది సినిమాలన్నీ శతదినోత్సవ చిత్రాలే. ఇంటి పేరు అసలు ఎవరికీ తెల...