పోస్ట్‌లు

జంతువు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జంతువు అయితేనేమి

జంతువు అయితేనేమి ప్రతి మానవుడు గుడిలో విగ్రహాన్ని ఇంటిలో దేవుడి పటములను పూజించడం , గణపతి నవరాత్రులలో గణపతిని పూజించడం దేవీ నవరాత్రులలో దేవిని పూజించడం సర్వ సాధారణమైన విషయం. అయితే మానవుడు దేవుళ్ళతో పాటు ఆవు వంటి సాధు జంతువులను పాములను కప్పలను కూడా పూజించడం మనం ఎరుగున్న విషయమే. అయితే మనం హిందువులు జరుపుకునే పండుగలు అన్ని దేవతామూర్తులకు సంబంధించినవే కాకుండా జంతువులు కూడా ఆ పండుగలలో ప్రధానంగా పూజించబడతాయి. ఉదాహరణకి కనుమ పండుగ రోజున ఎద్దులను అలాగే నాగుల చవితి రోజున పుట్టలో ఉన్న పాములను పూజించడం జరుగుతుంది. ఏ కాలంలో చూసిన పశుపక్ష్యాదులు జంతువులు కూడా మానవునికి సహాయ సహకారాలు అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాయి. ప్రతిఫలంగా మానవుడు వాటికి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి రుణం తీర్చుకుంటున్నాడు. హిందువులందరికీ ఆవు పవిత్రమైన జంతువు. శుభ అశుభ కార్యక్రమాలకు కూడా ఆవును పూజించడం మన సాంప్రదాయం. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముందుగా ఆవును దూడను  కొత్త ఇంటిలోకి ప్రవేశపెడతారు. మనం ఆవుని గోమాత అంటాం ఇక చనిపోయిన వారు ఆవు తోక ద్వారానే పుణ్య లోకం చేరుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే గోదానం ఇవ్వడం జరు...