పోస్ట్‌లు

బాప లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బాపనమ్మ

బాపనమ్మ      బాపనమ్మ అదేమీ అందమైన పేరు కాదు. ఒక సినీనటి పేరు అసలే కాదు. గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న రాజకీయ నాయకురాలు కాదు. కానీ ఆ ఊరిలో ఈనాటికీ ఆ పేరు ప్రజలందరినోళ్ళల్లో నానుతూ ఉంటుంది. నాకు తెలుసు ఉన్నంతవరకు ఆమెకు అమ్మవారి పేరు పెట్టి ఉంటారు.  మా ఊరి బడినీ అంటే మేము రాజులు బడి అని పిలుచుకునే వాళ్ళం . ఆ బడిలో చదువుకున్న వారు బాపనమ్మ పేరు, ఆ రూపం మర్చిపోయిన విద్యార్థులు గాని గ్రామస్తులు కానీ ఎవరూ ఉండరు. మా ఊరు పాఠశాల ని రాజులు బడి అని ఎందుకంటారు అని అందరికీ సందేహం కలగొచ్చు. కారణం ఏమిటంటే మా పాఠశాలకి సొంత భవనం లేదు. ఆ గ్రామం అప్పట్లో అది కాకినాడ తాలూకా లోని పల్లిపాలెం ఒక కుగ్రామం. ఇప్పుడు కాజులూరు మండలంలోని ఒక అభివృద్ధి చెందిన గ్రామం.ఆ గ్రామానికి అప్పట్లో సరైన రోడ్లు కానీ పాఠశాల భవనం గాని లేదు. ఆ ఊరిలో క్షత్రియ వంశానికి చెందిన సుబ్బరాజు గారు మరియు నారాయణ రాజు గారు అని ఇద్దరు అన్నదమ్ముల వసతి గృహం వెరసి మా ఊరి విద్యార్థులకు సరస్వతి నిలయం అయ్యింది.  ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ బడి వెనుక కాపురం ఉండేవారు. అప్పట్లో ఆ బడికి అద్దె ఉందో లేదో నాకు తెలియదు. ...