పోస్ట్‌లు

ఏప్రిల్ 2, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మాకు మనసు ఉంటుంది 👨‍⚕️🏥

అంశం : మాకు మనసు ఉంటుంది. నిత్యం మాకు కత్తుల తోటే యుద్ధం రాజ్యాల కోసం పోరాడే రాజులo కాదు ప్రాణాలు కాపాడే వైద్యులo అనుభవంతో చేయి పట్టుకోగానే  చేయి దాటిపోతున్నాడని చెప్పగలం. రాగల ప్రమాదం ముందే పసిగట్టగలం మొండి రోగానికి మందు వేయగలo కొన ఊపిరితో ఉన్న వాళ్ళని హుషారుగా నడిచేలాగ చెయ్యగలం. పోయే ప్రాణం గురించి ముందుగా చెప్పగలం. కానీ ఆ ఒక్కటి అడక్కండి  ప్రాణం మటుకు పోయలేము. వైద్యో నారాయణ హరి బిరుదులన్నీ మాకే ఆ బిరుదుల మాటున హరిదాగున్నాడని మాకు తెలుసు. మా చేతిలోంచి జారిపోయిన ప్రతి చెయ్యి మా గుండెల్లో కలతలు రేపుతుంది. మనసు కకావికలం అవుతుంది నిర్జీవమైన కళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటాయి. బంధువుల కళ్ళల్లోకి సూటిగా చూడలేo నోటి తోటి అప్రయత్నంగా చెప్పే సారీ తప్పితే నిత్యం ఏదో ఒక మరణం యాంత్రికమైపోయింది మా జీవనం. మరణం తప్పించాలని చేస్తాము రణం దైవఘటన ముందు పోరాడి ఓడిపోతాం. మా కన్నీటి బొట్లు ఎవరికీ కనబడవు మాకు మనసు ఉంటుంది మనసు మౌనంగా రోదిస్తుంది. మేము కూడా మనుషులమే నిర్జీవమైన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అతుకుతాం. వృత్తి ధర్మం ఏం చేస్తాం గోరుముద్దలు తినిపించిన కన్నతల్లి కావచ్చు ...

అతిధి

అతిధి  అతిధి రాగానే సాదరంగా ఆహ్వానిస్తాo ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ల చెంబు అందిస్తాo భుజం మీద తుండు అందిస్తాo లోపలికి ఆహ్వానించి కుర్చీ వేపు చేయి చూపిస్తాo నవ్వుతూ కుశల ప్రశ్నలు వేసి కాఫీ గ్లాసు అందిస్తాo పవర్ కట్ ను మరిపించేలా తాటాకు విసనకర్రతో విసురుతూ మాటామంతి మంచి చెడ్డ ఉభయకుశలోపరి. మధ్యలో ఓ గ్లాసు మజ్జిగ. మళ్లీ కబుర్ల ప్రవాహం అనుబంధాల ప్రహసనం బంధువులందరి వాకబు స్నేహితుల గురించి సమాచారo పిల్లల చదువు సంధ్య. కష్టం సుఖం కన్నీళ్లు ఇట్టే జరిగిపోతుంది కాలం కాళ్ళు కడుక్కోండి వేళయింది అంటూ వంటింట్లోనుంచి ఆహ్వానం. మడి కట్టు కోవడానికి ఎర్రటి పట్టు పంచ సిద్ధం తాతల నాటి టేకు కర్ర పీట పీట ఎదురు గుండా పరిచిన తోటలోని అరటి ఆకు ఆకు పక్కనే మర చెంబుతో నీళ్ళు వడ్డన ఆరంభం. తాతలనాటి మామిడి చెట్టు కాయ వేయించిన కందిపప్పు. వెరసి పప్పు మామిడికాయ. కోనసీమ కొబ్బరి పచ్చడి అరటికాయ కూర అరటి దూట పచ్చడి కోనసీమ అరటిపండు పంటి కింద గుమ్మడి వడియం. తీపి ముక్కల పులుసు మధ్యలో దుంప తగిలితే అదుర్స్ రుచికోసం కొత్తావకాయ లు మారు అడిగితే మహదానందం. కొసరి కొసరి వడ్డన. గడ్డపెరుగు లోకి చెరుకు రసం మామిడి పండు. ఆప్యాయతతో ...

పండుగ మామూలు

పండుగ మామూలు ఉదయం 6:00 అయింది  అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి గట్టిగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఆ గొంతు ప్రెసిడెంట్ గారిది లా ఉంది అనుకుంటూ బాల్కనీ నుంచి కిందకు తొంగి చూశాను. సాక్షాత్తు మా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ముక్కోపి. ఇండియాకు ప్రెసిడెంట్ గా ఫీల్ అయిపోతుంటాడు  ఇంత పొద్దున్నే ఎవరబ్బా ఆయనకు బలి అయిపోయింది అనుకుంటూ చూస్తే ఎదురుగుండా మున్సిపాలిటీ వాళ్ళ ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అపార్ట్మెంట్ ఎదురుగుండా రోడ్డుమీద రోజు వ్యర్థ పదార్థములు తీసుకువెళ్లే ట్రాక్టర్ నిలిపి ఉంది. ఓహో అయితే ఈ మనిషి ప్రతాపం ఈవేళ పాపం రోజు వ్యర్థ పదార్థాలు తీసుకుని వెళ్లే మున్సిపాలిటీ వాళ్ళ మీద అన్నమాట.  మా అపార్ట్మెంట్లో మొత్తం యాభై ప్లాట్లు ఉంటాయి. మాది భాగ్యనగరంలో ప్రగతి నగర్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ కట్టి పదిహేను ఏళ్లయింది. ప్రతిరోజు మన శరీరం లాగే మనం నివసించే ఇల్లు కూడా వ్యర్థ పదార్థాలను ఇంట్లో ఉంచుకోదు. కాదు కాదు మనం ఆ ఇంట్లో ఉండలేం. కంపు భరించలేక అనారోగ్యాలు తెచ్చుకోలేక.   ప్రతిరోజు ప్రతి ప్లాట్ నుంచి సుమారుగా రెండు డబ్బాలు చెత్త వస్తుంది....

కనకయ్య

కనకయ్య తాత సాయంకాలం నాలుగు గంటలు అయింది. మండువేసవి కాలం. చల్లగాలి కోసం వీధిఅరుగు మీద కూర్చున్న కనకయ్య తాతకి గుమ్మo ముందు రిక్షా ఆగి అందులోంచి ఒక జంట దిగుతూ కనబడ్డారు.  " రండి బావగారు ఏమ్మా సుమతి ఎలా ఉన్నావ్? ఇద్దరు లోపలికి  రండి అంటూ హాల్లోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు.  ఇంతలో కనకయ్య తాత భార్య రవణమ్మ గ్లాస్ తో మజ్జిగ  తీసుకొచ్చి ఇచ్చింది. కుశల ప్రశ్నలు అయ్యాయి.  ఇంతలో సుమతి బ్యాగ్ లో నుంచి శుభలేఖ తీసి " అన్నయ్య   చిన్నమ్మాయికి కూడా పెళ్లి కుదిరింది. ఈ నెల 30వ తారీఖునపెళ్లి ముహూర్తం. నువ్వు మా పెద్ద పిల్ల పెళ్ళికి ఎంతగానో సహాయం చేసావు. నేను ఆ భోజనాలు సంగతి అసలు పట్టించుకోలేదు.గాడి పొయ్యి దగ్గరకి కూడా రాలేదు. అప్పుడు మగ పెళ్లి వారందరూ భోజనాలన్నీ చాలా చాలా బాగున్నాయి అంటూ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు అంటూ ఇప్పటికీ చెప్తుంటారు.ఈ పెళ్లి కూడా నీ చేతుల మీదుగానే జరిపించు అన్నయ్య అంటూ శుభలేఖ ఇచ్చి చేతులు పట్టుకుంది. బావగారు మా మీద కాస్త దయ ఉంచండి అంటూ సుమతి భర్త కూడా చేతులు పట్టుకున్నాడు. లేదమ్మా మీరేమీ భయపడకండి. నేను వారం రోజులు ముందు వచ్చి ...