పోస్ట్‌లు

అక్టోబర్ 13, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

మర్రిచెట్టు

లాల్ బహుదూర్ నగర్ మర్రిచెట్టు. రోజు నడిచే రహదారే ఆరోజు ఎందుకో దారి తప్పి వచ్చానని అనుకున్నా ఏదో వెలితి  నిన్నటిదాకా చల్లటి గాలితో నీడనిచ్చిన మర్రి మరి కనపడలేదు నిజంగా మర్రి బాటసారి లందరికీ మురారి. ఎవరూ నీరు నారు పోసి పెంచలేదు. రోడ్డు పక్కన అనాధల పెరిగి లాల్ బహుదూర్ నగర్ వాసుల అడ్రస్ కి అడ్డా అయింది. వంద సంవత్సరాల బ్రతికిన మనిషిని  గొప్పగా చెప్పుకుంటారు. ఈ మర్రిమాను వయస్సును కొలిచేవాడు పైనున్న దేవుడు ఒక్కడే. పొడవాటి జడలతో రాక్షసుడులా కనిపించే మర్రి రెండు ముక్కలైంది. అవశేషాలన్నీ నిర్జీవంగా దొర్లుతున్నాయి  గూడు చెదిరిన పక్షులు ఆక్రందనగా అరుస్తున్నాయి కొత్త గూడు కోసం వలసలు వెళ్ళిపోతున్నాయి. ఎవరిస్తారు ఆ పక్షులకు ఆశ్రయం. అంత పెద్ద మాను దొరకాలంటే చెయ్యాలి భగీరథ ప్రయత్నం. మర్రి నీడలో మొక్క మొలవదు అంటారు. చిరు వ్యాపారికి ఆశ్రయమిచ్చి బ్రతుక్కి దారి చూపేది దారి తెన్ను లేక చెదిరిపోయింది చిరు వ్యాపారి బ్రతుకు. చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్న చీమలకి అయాచితంగా  ఆహారం దొరికేది. పండిన మర్రి పండు తిని ఆనందంగా కాలం గడిపేవి. చెట్టుతోపాటు పుట్టలన్నీ పోయాయి. చీమల పొట్ట కొట్టేశారు అట్...

చంటి బిడ్డ

చంటి బిడ్డ ఆ మాయా లోకం నుండి  మన లోకానికి వచ్చిన మహావీరుడు. నవ మాసాలు చిమ్మ చీకటిలో పయనించి మాయా నిద్ర లో మునిగి పైకి తేలి మనల్ని ఆనంద సాగరంలో ముంచిన అందాల వీరుడు. కెవ్వుమంటూ కేక వేసి తన రాక తెలియజేస్తాడు. అమ్మకి అమ్మతనం తీసుకొస్తాడు. బంధుజనంతో వరసలు కట్టేస్తాడు అతిధి మర్యాదలు కోరడు నోరు తెరిచి బువ్వ పెట్టమని అడగడు కొంగు చాటున చేరి తను తీసుకువచ్చిన బువ్వ తినేస్తాడు. అమ్మ పక్కకు చేరి అన్నయ్యని ఏడిపిస్తాడు వాడికి తెలియదు పాపం అమ్మ ఒడి అక్షయపాత్ర లాంటిది ఎంతమంది చేరిన కొంత చోటు మిగులుతుంది అమ్మ మనసు కూడా అంతే. పుట్టిన పురిటి గదికి రారాజు. అమ్మ కి వాడు నెలరాజు. నాన్న మదిని దోచిన మహారాజు. ఈ మహారాజుకి ఎన్ని పూల పాన్పులో బొజ్జ నింపడానికి అందాల అమ్మ వడి చేరుతాడు జోగిన కళ్ళతో ఉయ్యాల ఎక్కి అమ్మకి జోల పాట నేర్పుతాడు. ఊరికనే ఉయ్యాల ఎక్కడు ఉత్సవాలు జరిపి ఆ సింహాసనం ఎక్కుతాడు.  నోటి మాటతో కాదు  నోరంతా తెరిచి రాగం తీసి పెత్తనం చేస్తాడు  పరివారాన్నంతా పరిగెత్తించి సపర్యలు పొందుతాడు.  బుంగమూతి పెట్టి గారాలు పొందుతాడు  నోటిలో వేలు దోపి చిన్ని కృష్ణుడిని మరిపిస్తాడు. ...

కళాతపస్వి

కళాతపస్వి.  శ్రవణేంద్రియముల ద్వారా మనసుకు ఆనందం కలిగించేది సంగీతం. స్వరబద్ధమైన సంగీతం మనుషులందరినీ కాదు ప్రాణులన్నింటిని కూడా ఆనందపరుస్తుంది. ఆ సంగీత ప్రధానంగా చిత్రాలు తీయడమే ఒక కత్తి మీద సాము. అయినా అది ఒక మహా దర్శకుడు కి అభిరుచి. సినిమా పేర్లు కూడా వరుసగా స అనే అక్షరంతో ప్రారంభించిపెట్టడం కూడా అరుదైన విషయం. ఆ దర్శకుడు ఎవరో కాదు కళాతపస్వి. సంగీత ప్రధానంగా ఉన్న చిత్రాలు తీయడమే మన విశ్వనాథుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతోమంది దర్శకులు ఉన్నారు. కొద్ది మంది మాత్రం కలకాలం మన మదిలో నిలిచిపోతారు. కులం గోత్రం మనకు అవసరం లేదు. ప్రేక్షకుల గుండెను దోచుకున్నాడా లేదా అన్నదే ప్రశ్న. తొలి సినిమాతో తెలుగు కళామతల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి బంగారు నందిని కూడా తన వాకిట్లో కట్టేసుకున్నాడు. విప్లవ రచయిత శ్రీశ్రీ గారి చేత ప్రేమ పాటలు రాయించేసాడు. ఒక మూగ పిల్ల చేత నాట్యం చేయించి ఝుమ్మంది నాదం అంటూ తెలుగు కళామతల్లి దర్శకులలో సిరిసిరి మువ్వగా నిలిచాడు. ఎప్పుడూ ఖాకీ దుస్తులలో కనిపించే కళా కార్మికుడు. పొట్ట చించితే అక్షరం ముక్క రాదు అయినా సినిమా మీద మోజుతో మాయమాటలు నమ్మి పట్నం చేరిన ఒక మహాలక్ష్మి కథ. సీ...

మన విశాఖ

మన విశాఖ ఉక్కు నగరo కాదు ఉర్రూతలు ఊగించే నగరం విశాలమైన నగరం మనోవికాసానికి సరియగు స్థలం. మన విశాఖ నగరం. విహారయాత్రలకు అనువైన స్థలం ఉక్కు లాంటి పట్టుదల సాగరం లాంటి మనసు నిత్యం అప్పన్న ఆశీర్వాదం  కలిమికి కనకమహాలక్ష్మి అండ సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు విశాఖ వాసులకు అదే అదృష్టం సుందర నగరం మీదుగా జాతీయ రహదారి నడిరేయిలో కూడా నగరం చేర్చే సౌకర్యమే హాయి నాలుగు చక్రాల బండి ఉంటే సరే సరి షికారుకి సాగర తీరాలన్నీ రెఢీ సంపత్ వినాయకుడికి అభిషేకం చేసుకుని కనకమహాలక్ష్మి పూజ ముగించుకుని విహారయాత్ర విజయంగా జరగాలని యారాడ వైపు దారి తీద్దాo. ముచ్చటగా మూడు దిక్కుల కొండలు నాలుగోదిక్కు నీలి రoగు సముద్రం యారాడ సాగర తీర విహారం ప్రతి మనిషికి ఉత్సాహo ఆ సాగరానికి కొండలకి మధ్య అనుబంధం ఆటుపోటులు ఎన్ని వచ్చినా కొండకి కరగని ధైర్యం జలకాలాడే చేప పేరు ధరించి ఆ కొండ తీర్చుకుంది రుణం. కొండ ఎక్కించి నగరవాసులకు చూపుతోంది సాగరమంతా అదే డాల్ఫిన్ నోస్. ఆ సాగర తీరం ఋషులుగా మారుస్తుంది అలలన్నీ పాదాలకు తాకి మనసును అందలం ఎక్కిస్తుంది అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది రుషులు లేని ఋషికొండ  వయస్సుతో నిమిత్తం లేదు పడి లేచే ...

మా ఊరి వినోదం

మా ఊరి వినోదం.  అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పొలిమేరలో మా చింతలు తీర్చే పోలేరమ్మ కాపురం. ఆ దేవాలయానికి ఎదురుగా అందమైన చెరువు. చెరువులో నిత్యం స్నానం చేసేది అమ్మవారి భక్తులు కాదు. అమ్మ బిడ్డలు వదిలేసిన మురికి దుస్తులు. తరతరాలుగా అదే రేవు. రేవు గట్టుమీద మురికి బట్టలతోపాటు తలలు తెగిపడి ఉన్న జీవులు. రక్తపు మరకలు. గాలికి ఎగురుతున్న కోడి ఈకలు. అమ్మవారి గుడి ముందు గుమి కూడిన జనం . జనం మధ్యలో జనాలను అదుపు చేస్తూ చింత నిప్పులాంటి కళ్ళతో ఒక భారీ కాయం. మధ్యలో కోడిపుంజుల పౌరుషం. ప్రాణాలకు తెగించి పోరాటం. చుట్టూ ఉన్న జనం అరుపులు కేకలు ఈలలు గోలలు. ఇంతకీ ఆ సంబరం ఏమిటి అక్కడ జరుగుతున్నది ఏమిటి. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి జరిగే కోడి పందాలు ఆట. సంక్రాంతికి జరిగే సంబరం. మా ఊరి ప్రజలకు సంక్రాంతి వినోదం.  మా ఊరు అంటే ఎవరికి తెలుస్తుంది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఒక పల్లె. ఆ పల్లె పేరు పల్లిపాలెం. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గ్రామం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. అన్ని పల్లెటూర్లు మాదిరిగానే. వేద పండితులు పురాణ కర్తలు కవులు...

గంగిరెద్దు

చిత్రం
స్త్రీలకు అలంకరణ అందాన్నిస్తుంది. ఎవరైనా అతిగా అలంకరించుకుంటే గంగిరెద్దులతో పోలుస్తారు. చెప్పిన మాటల కల్లా తల ఊపుతుంటే గంగిరెద్దులా తలాడిస్తోంది అంటారు. కారణం ఏమిటంటే ప్రతి సంక్రాంతి పండుగకి ప్రతి వీధిలోను దర్శనమిచ్చే గంగిరెద్దు విచిత్ర అలంకరణలతో దర్శనమిస్తుంది. గంగ రెద్దు కొమ్ములు దగ్గర నుండి మోపురం వరకు ప్రతి అవయవం అందంగాఅలంకరిస్తారు. ఈ గంగిరెద్దులవారు సంచార జాతికి చెందినవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలోనే దర్శనమిస్తారు. ఎద్దును తీసుకుని ఊరురా తిరిగి జీవనం గడుపుకుంటారు. సరే వీరికి ఎద్దు ఎలా వస్తుంది అనే ప్రశ్న మదిలో మెదులుతుంది.   సింహాచలము వేములవాడ వంటి దేవస్థానాల్లో కోడెదూడలను దేవుడికి కానుకగా ఇచ్చి మొక్కులు తీర్చుకునే ఆచారం ఒకటి ఉంది. ఆ దేవస్థానం దగ్గర నుంచి ఈ గంగిరెద్దుల వారు కోడెదూడలను కొనుక్కుని ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆట నేర్పి సన్నాయితో యజమాని పాడే పాటకు అనుగుణంగా ఎద్దు తలలూపుతూ విన్యాసాలు చేస్తుంది. యజమాని మాట ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ అయిందానికి కాని దానికి ఎద్దు తల ఊపుతుంది. ఆ నోరులేని మూగ జీవి యజమానికి ఇంత అన్నం సంపాదించి పెడుతుంది. ఇలా ప్రతి సంక్రాంతి పం...

పల్లె సంక్రాంతి

పల్లె సంక్రాంతి సంక్రాంతి ఎంత అందమైన పేరు. నిజంగానే ఒక కొత్త కాంతిని తీసుకొస్తుంది ఈ పండుగ.పెళ్లయిన ఆడపిల్ల అత్తారింటి నుండి పుట్టింటికి పండక్కి ప్రయాణమైనట్లు సూర్యుడు కూడా మకర రాశిలోకి ప్రయాణమవుతాడు. అమ్మాయి పండగకి పుట్టింటికి వస్తే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం. ఆడపిల్ల పండగకి కొత్త వెలుగు తీసుకొస్తుంది. ఇంటికి అందo వస్తుంది. లోకమంతటికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడంతో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. పండగ అందరికీ సమానమే. కానీ పల్లెటూరి పండగ అందమే వేరు. ఇంకా తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండగ అందం పూర్తిగా కనబడుతుంది. నెల రోజుల ముందు నుంచే వీధుల లలో కళ్ళాపి జల్లి పోటీపడి వేసే ముగ్గులతో సంక్రాంతి సంబరాలు మొదలు. ముగ్గులు పెట్టడం కూడా ఒక కళ. ముగ్గు తెలుగు వాకిళ్లకు ఒక అందం . ముగ్గుతో అలంకరించడం ఒక శుభ సూచకం. ఇలా ప్రారంభమైన ముగ్గుల సందడి ముక్కనుమ పండుగ వరకు కొనసాగుతుంది. ముక్కనుమ నాడు వేసే రథం ముగ్గుతో ముగుస్తుంది. గోమయంతో చేసిన గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి కన్నెపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ చేరి నృత్యాలు చేస్తారు. పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. గోదాదేవిని ఆరాధి...

కన్యాశుల్కం

కన్యాశుల్కం  మానవుడు ఊహనుంచి పుట్టిందే కవిత్వం. ఏ కళ అయినా కూడా మనిషి ఊహనుంచి పుట్టినవే. ఊహ ఎంత గొప్పది. ఆ ఊహకి ఆధారం చుట్టూ ఉండే సమాజం, సమాజంలోని లోటుపాట్లు కావచ్చు. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య మీద ఆకలి రాజ్యం వంటి చలనచిత్రం రూపుదిద్దుకుంది. అలాగే వరకట్నం మీద అనేక రచనలు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఒక ప్రియుడు తన ప్రియురాలు విరహ వేదన భరించలేక మేఘముల ద్వారా సందేశం పంపుతాడు. అదే కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యం. ఇది నిజంగా జరిగింది కాదు. కానీ కవి ఊహించి వ్రాసింది. అలాగే లంచగొండితనం మీద అనేక సాంఘిక చలనచిత్రాలు వచ్చాయి.      ఆనాటి సంఘంలో ఉన్న సాంఘిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక అద్భుతమైన నాటక కళాఖండాన్ని తయారు చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు గారు. ఆ రోజుల్లో కన్యకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. ఒక విధంగా కన్యను కొనుక్కున్నట్లే. పది పన్నెండు సంవత్సరముల వయస్సులోనే ఆడపిల్లలు కన్యాశుల్కానికి బలి అవుతుండేవారు. కాటికి కాళ్లు చాచుకుని ఉండే ముదుసలి కూడా పునర్వివాహం చేసుకునేవారు. అలా ఎందరో పసి మొగ్గల జీవితాలు నాశనం అవుతుండేవి. ఆ ముసలి ప్రాణం కాస్త గుటుక్కుమ...