ఊర్మిళాదేవి
ఊర్మిళాదేవి ఒక్క పక్షి మరణం ఒక ఆదర్శప్రాయమైన సీతారాముల కథను లోకానికి తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాడు. సీతారాములే కాకుండా భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా లోకానికి ఆదర్శప్రాయులు ఎలా అయ్యారు అన్నది మనకి తెలియజేశాడు ఆ మహర్షి. ఈ శ్రీరాముడు కథలో అన్ని పాత్రలు కూడా ఆదర్శ పాత్రలే. ఏకపత్నివృత్రుడుగా తండ్రి మాట జవదాటని వ్యక్తిగా శ్రీరామచంద్రుడు మనకి కనపడతాడు. భాతృ ప్రేమలో లక్ష్మణుడు భరతుడు లోకానికి ఆదర్శప్రాయలుగా కనిపిస్తారు. లోకంలో ఆదర్శవంతమైన భార్యగా సీతాదేవి నిలిచిపోయింది. రామ బంటుగా హనుమ, స్నేహితుడుగా సుగ్రీవుడు, సేవకుడుగా గుహూడు ఇలా ఎన్నో పాత్రలు జాతి గుండెలో చిరస్థాయిగా నిలబెట్టింది రామాయణం. అయితే మరొక్క పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర కూడా చెప్పుకోదగినది. వాల్మీకి చేత రచించబడిన శ్రీమద్రామాయణంలో ఊర్మిళాదేవి గురించి చాలా తక్కువగా చెప్పినప్పటికీ ఆమె పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పడంలో సందేహం లేదు. ఊర్మిళాదేవి జనకమహారాజు తమ్ముడైన కుశ ధ్వజడు కుమార్తె. కుశధ్వజుడు విద్యానగరమును పరిపాలిస్తూ ఉ...