పోస్ట్‌లు

రామనవమి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రామనవమి

రామ నవమి ఆది కవి వాల్మీకి మహర్షి చేత రచించబడినది రామాయణo. దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి కథ శ్రీ రామాయణం. సీతారాముల కమనీయ గాధ రామాయణo. రాముడు అనుసరించిన మార్గం.రాముడు నడచిన మార్గం. ఇందులో 24000 శ్లోకాలు ఉంటాయి. రామాయణo అతి ప్రాచీనమైనది .అందుకే ఆదికావ్యం అంటారు. రామాయణం 6 కాండలు గా విభజించబడింది. బాలకాండలో శ్రీ రాముని జననం నుండి సీతాకల్యాణం వరకు వివరించబడ్డాయి. అయోధ్యకాండలో దశరథుని భార్య అయిన కైకేయి కోరిక నుండి సీతా రామ లక్ష్మణ లక్ష్మణ వనవాస వ్రతం ప్రారంభం అయ్యే దాకా వివరించబడింది.సీతారాములు వనవాస కాలం నుండి శూర్పణఖ భంగము మరియు సీతాపహరణం దాకా అరణ్యకాండలో పొందుపరచబడింది. ఇక కిష్కింధకాండ లో వానర రాజు సుగ్రీవుడితో శ్రీరాముడు స్నేహం వాలి వధ సీతాన్వేషణ ప్రారంభము చెప్పబడింది. తర్వాత సుందరమైనది సుందరకాండ. హనుమంతుడు సముద్రము దాటుట సీత జాడ కనిపెట్టడం లంకా దహనం వివరించబడ్డాయి. సాగరమునకు వారధి నిర్మించుట, రావణ రావణ యుద్ధము రావణ సంహారము ,శ్రీరామ పట్టాభిషేకం యుద్ధకాండలో విపులంగా వివరించబడ్డాయి. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. అన్ని సంపదలు ఉన్న రాజుగారికి సంతానభాగ్యం కలుగలేదు.పుత్ర కామేష...